టీయూటీఎఫ్ రాష్ట్ర కార్యవర్గంలో జిల్లా వాసులు
నిర్మల్ రూరల్: తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్(టీయూటీఎఫ్) రాష్ట్ర కార్యవర్గంలో జిల్లాకు చెందిన ముగ్గురికి చోటు లభించింది. రాష్ట్ర సహాధ్యక్షులుగా ఎ.లక్ష్మీప్రసాద్‌రెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా నోముల శరత్చందర్రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా వీర్బా పాటిల్‌ను ఎన్నుకున్నారు. విద్యారంగ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఈ సందర్భంగా వీరు తెలిపారు. రాష్ట్ర కార్యవర్గంలో స్థానం దక్కించుకున్న ముగ్గురికీ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ఏ.మురళీ మనోహర్‌రెడ్డి, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు తోడిశెట్టి రవికాంత్, వహీద్‌ఖాన్, కోశాధికారి పోల ధర్మరాజ్, జిల్లా గౌరవ అధ్యక్షుడు ముస్కు పరమేశ్వర్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment