మోతాదుకు మించి మందులు వాడొద్దు
● డీఎంహెచ్‌వో డాక్టర్ రాజేందర్
నిర్మల్‌చైన్‌గేట్: మోతాదుకు మించి మందులు వాడడం అనర్థకమని డీఎంహెచ్‌వో డాక్టర్ రాజేందర్ అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్‌పై జిల్లా వైద్య అధికారులకు సోమవారం వర్క్‌షాప్ నిర్వహించారు. డీఎంహెచ్‌వో రాజేందర్ మాట్లాడుతూ మోతాదుకు మించి మందులు ఉపయోగించడం వల్ల బ్యాక్టీరియా, వైరస్ పారాసైట్స్, శిలీంద్రాలకు డ్రగ్ రెసిస్టెన్సీ కారణంగా ఇన్‌ఫెక్షన్ తగ్గక, వ్యాధి తీవ్రత పెరిగి, మరణా లు సంభవించే అవకాశం ఉందని హెచ్చరించా రు. దీనిని నిరోధించడానికి, నివారించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించడం కోసం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నా రు. కార్యక్రమంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ లక్ష్మి, డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ ఇధ్రిస్ గౌరీ, నిర్వాహణాధికారులు రవీందర్‌రెడ్డి, సౌమ్య, రాజా రమేశ్, డిప్యూటీ జిల్లా విస్తరణ, మీడియా అధికా రి బారె రవీందర్, జిల్లాలోని వైద్యాధికారులు, నర్సింగ్ ఆఫీసర్లు, ఫార్మసిస్టులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment