ఉచిత ప్రయాణ వసతి కల్పించాలి
నిర్మల్‌టౌన్: అర్హులైన దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీని అమలు చేయాలని దివ్యాంగుల జాయింట్ యాక్షన్ కమిటీ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ నర్సయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపో ఎదుట దివ్యాంగులు నిరసన తెలిపారు. అనంతరం డిపో మేనేజర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నర్సయ్య మాట్లాడుతూ.. ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా ఎన్నో ఇబ్బందులు పడుతున్న తమకు ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో 100 శాతం రాయితీ కల్పించాలని, రూ.6వేల పింఛన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కమిటీ రాష్ట్ర కన్వీనర్ సాయన్న, కోకన్వీనర్ ప్రవీణ్‌కుమార్, సభ్యులు ముత్యం, భగవాన్, సత్యనారాయణ, సౌమ్య, భో జారెడ్డి, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment