అంతరాయం లేకుండా చూడాలి
ఖానాపూర్: రైతులు, ప్రజలకు విద్యుత్ అంతరాయం లేకుండా అధికారులు, సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించాలని విద్యుత్‌శాఖ ఏస్‌ఈ సుదర్శనం సూచించారు. శుక్రవారం మండలంలోని మస్కాపూర్ గ్రామంలోని ఎల్‌ఆర్ గార్డెన్స్ ఫంక్షన్‌హాల్‌లో ఖానాపూర్, కడెం, పెంబి, దస్తురాబాద్, మామడ మండలాల అధికారులు, సిబ్బందితో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాట్లాడారు. ఎలాంటి సమస్యలున్నా వెంటనే పరిష్కరించి ప్రజలు, రైతులు అసౌకర్యానికి గురికాకుండా చూడాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అధికారులు నాగరాజు, లక్ష్మణ్‌నాయక్, రాంసింగ్ తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment