వుషూ పోటీల్లో భైంసా విద్యార్థుల ప్రతిభ
భైంసాటౌన్: జిల్లాకేంద్రంలో నిర్వహించిన సీఎం కప్ జిల్లాస్థాయి వుషూ పోటీల్లో ఖేలో ఇండియా భైంసా కేంద్రం విద్యార్థులు సత్తాచాటారు. పది మంది విద్యార్థులు రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారని కోచ్ సాయికృష్ణ తెలిపారు. నక్షత్ర(21కేజీలు), డి.రాజేశ్వరి(33 కేజీలు), ఎల్.మమత(36కేజీలు), కె.పల్లవి(48కేజీలు), కల్యాణిబాయి(52కేజీలు), అబ్దుల్ రహమాన్(21కేజీలు), శ్రేయాన్ కార్తీకేయ(30కేజీల) తిరుపతి, కృష్ణ, యువరాజ్ రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు. అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ విద్యార్థులను అభినందించి, ప్రశంసపత్రాలు అందజేశారు. ఈనెల 26న హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో క్రీడాకారులు పాల్గొంటారని కోచ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment