కొనసాగుతున్న సమగ్ర ఉద్యోగుల సమ్మె
నిర్మల్ రూరల్: ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగులు చేపట్టిన సమ్మె ఆది వారం 20వ రోజుకు చేరింది. ఆర్డీవో కార్యాల యం ఎదుట ఉద్యోగులు నోటికి నల్ల రిబ్బన్లు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బడుగు, బలహీన వర్గాలు, పేద విద్యార్థులకు బోధిస్తున్న తమను ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని ఆరోపించారు. విద్యాశాఖలో అంకితభావంతో పనిచేస్తున్న తమకు ఉద్యోగ భద్రత కల్పించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. 20 ఏళ్లుగా విద్యావ్యవస్థకు వెన్నెముకగా నిలిచామని తెలిపారు. ప్రభుత్వం వెంటనే తమను విద్యాశాఖలో విలీనం చేయాలని కోరారు. వెట్టి చాకిరీ, శ్రమ దోపిడీ నుంచి విముక్తి కల్పించాలని విజ్ఞప్తి చేశారు. లేని పక్షంలో సమ్మెను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. డీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు మహేంద్రాచారి, టీపీటీఎఫ్ రాష్ట్ర నాయకుడు విజయకుమార్ దీక్షాశిబిరాన్ని సందర్శించి ఉద్యోగులకు మద్దతు తెలిపారు. నా యకులు గంగాధర్, నరేశ్, గజేందర్, వాణి, రాము, ప్రమోద్, తిరుమల, నవిత, ఆనంద్, గంగాధర్, అజయ్, రవీందర్, మతిన్, లతా దేవి, జ్యోతి, వీణ తదితరులు పాల్గొన్నారు.
ఉపాధ్యాయుడికి
ఘన సన్మానం
సోన్: విజయవాడ కేంద్రంగా ఈ నెల 28, 29 తేదీల్లో నిర్వహించిన ఆరో ప్రపంచ తెలుగు రచయితల మహాసభల్లో మండలంలోని న్యూ వెల్మల్ బొప్పారం జెడ్పీ హైస్కూల్ తెలుగు ఉపాధ్యాయుడు, కవి, రచయిత కొండూరు పోతన్న పాల్గొన్నారు. కవి సమ్మేళనంలో తెలుగు భాష గొప్పతనాన్ని తెలిపే పద్యాలు ఆలపించారు. సాహితీ సదస్సులో తెలుగు భాష ఔన్నత్యాన్ని చాటి చెప్పి, పద్య రచన మెళకువలను యువకవులకు తెలిపారు. తెలు గు సాహిత్యాభివృద్ధికి పలు సూచనలు చేశారు. దీంతో పోతన్నను నిర్వాహకులు అభినందించారు. ప్రశంసాపత్రం, జ్ఞాపికతో ఆదివారం సత్కరించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు విద్యాసాగర్, ఉపాధ్యాయలు, గ్రామస్తులు, సాహితీ అభిమానులు పోతన్నకు అభినందనలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment