జిల్లా జట్టుకు సిల్వర్ మెడల్
నిర్మల్‌టౌన్: రాష్ట్రస్థాయి సీఎం కప్ పోటీల్లో జి ల్లా క్రీడాకారులు సత్తా చాటారని జిల్లా క్రీడలశాఖ అధికారి శ్రీకాంత్‌రెడ్డి ఓ ప్రకటనలో తెలి పారు. ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించిన అత్యపత్య అండర్–17 బాలికల ఫైనల్స్‌లో సంగారెడ్డి–నిర్మల్ జట్లు తలపడగా.. 18– 17 పాయింట్స్‌తో సంగారెడ్డి విజయం సాధించింది. నిర్మల్ జట్టు రెండో స్థానంలో నిలిచి సిల్వర్ మెడల్ కైవసం చేసుకుంది. అలాగే హై దరాబాద్‌లోని జీఎంసీబీ కాంప్లెక్స్‌లో ఈనెల 27 నుంచి 29వరకు నిర్వహించిన కిక్ బాక్సింగ్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు ప్రతిభ కనబరిచారు. పీహెచ్ నక్షత్ర 55 కేజీల విభాగంలో వెండి పతకం, పీ సుగంధ 46 కేజీల విభాగంలో కాంస్య పతకం, జీ మౌనిక 65 కేజీల విభాగంలో కాంస్య పతకం సాధించారు. వీరిని జిల్లా క్రీడల అధికారి అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment