మార్మోగిన అన్నపూర్ణ క్షేత్రం
భైంసాటౌన్: పట్టణంలోని కిసాన్గల్లిలోగల అన్నపూర్ణ క్షేత్రం అయ్యప్ప శరణుఘోషతో మార్మోగింది. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని అయ్యప్ప ఆలయంలో మంగళవారం నిర్వహించిన ప్రత్యేక పూజాది కార్యక్రమాలకు భక్తులు, దీక్షాపరులు అధికసంఖ్యలో హాజరయ్యారు. ఆలయ గురుస్వామి మంత్రి సాయినాథ్ ఆధ్వర్యంలో ఆలయంలో ఉదయం 4.30గంటలకే గణపతి హోమం, స్వా మివారికి అభిషేకం, పూర్ణాహుతి నిర్వహించారు. సాయంత్రం నిర్వహించిన పడిపూజ కార్యక్రమానికి ఎమ్మెల్యే రామారావు పటేల్ హాజరై స్వామివారికి అభిషేక పూజలు చేశారు. అనంతరం సాయంత్రం మకరజ్యోతి దర్శనం చేసుకున్నారు. అధికసంఖ్యలో భక్తులు హాజరయ్యారు. స్వామివారి భజన పాటలు పాడుతూ నృత్యాలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment