యథేచ్ఛగా ఇసుక రవాణా
లక్ష్మణచాంద: మండలంలోని గోదావరి పరీవాహక పీచర, ధర్మారం గ్రామాల నుంచి యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా కొనసాగుతోంది. అక్రమార్కులు గోదావరి నుంచి రాత్రీపగలు తేడా లేకుండా నిత్యం ట్రాక్టర్ల ద్వారా ఇసుకను అక్రమంగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. పీచర గ్రామ సమీప చెరువు పక్కన, పంట పొలాలు, పీచర నుంచి సోన్ వెళ్లే రహదారి పక్కనున్న ముళ్ల పొదల వద్ద నిల్వ చేస్తున్నారు. పగలు ట్రాక్టర్ల ద్వారా తరలించి రాత్రి వేళ టిప్పర్ల ద్వారా జిల్లా కేంద్రానికి తరలిస్తూ రూ.లక్షల్లో సంపాదిస్తున్నారు. పీచర, ధర్మారం గ్రామాల మీదుగా అక్రమంగా ఇసుక తరలిపోతున్నా ఎవరూ పట్టించుకోవడంలేదు. ఇప్పటికై నా ఇసుక అక్రమ రవాణాను అరికట్టి భూగర్భ జలాలు అడుగంటిపోకుండా చూడాలని ఆయా గ్రామాల ప్రజలు, రైతులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment