పీఎం ఉష పనులు ప్రారంభించాలి
భైంసాటౌన్: పట్టణంలోని జీఆర్‌పీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు పీఎం ఉష కింద రూ.5 కోట్లు మంజూరైనా కాంట్రాక్టర్ పనులు చేపట్టడం లేదని కళాశాల అధ్యాపకులు తెలిపారు. పట్ట ణంలో ఎమ్మెల్యే పి రామారావు పటేల్‌ను గు రువారం కలిసి విన్నవించారు. ఏడాది క్రితం రూ.5 కోట్లు మంజూరయ్యాయని, అయినా కాంట్రాక్టర్ పనులు ప్రారంభించడం లేదని ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. వెంటనే పనులు చేపట్టేలా చూడాలని కోరారు. స్పందించిన ఎ మ్మెల్యే పనులు వెంటనే ప్రారంభించేలా అధి కారులతో మాట్లాడతానని అధ్యాపకులకు తె లిపారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో ప్రిన్సి పాల్ బుచ్చయ్య, వైస్ ప్రిన్సిపాల్ రఘునాథ్, అధ్యాపకులు సుధాకర్, పీజీ.రెడ్డి, శంకర్, ఓం ప్రకాశ్, భీంరావు తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment