సేవాలాల్ దీక్ష గురువును సన్మానించిన ఎమ్మెల్యే
భైంసాటౌన్: సేవాలాల్ దీక్ష గురువు ప్రేమ్‌సింగ్ మహరాజ్ గురువారం భైంసాకు వచ్చా రు. ఈ మేరకు పట్టణంలోని ఎమ్మెల్యే పి.రా మారావ్ పటేల్ నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా మహరాజ్‌ను ఎమ్మెల్యే శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంత రం మాట్లాడుతూ.. ఫిబ్రవరి 16న బాసరలో సేవాలాల్ జయంతి నేపథ్యంలో ఏర్పాట్లపై చర్చించిన ట్లు తెలిపారు. ఏఎంసీ మాజీ చైర్మ న్ రాజేశ్‌బాబు మాట్లాడుతూ.. సేవాలాల్ మహరాజ్ కు బాసరతో ప్రత్యేక అనుబంధం ఉందన్నా రు. అప్పట్లో 45రోజులపాటు అమ్మ వారి క్షేత్రంలో తపస్సు చేశారని గుర్తు చేశారు. ఇందులో భాగంగానే ఈసారి బాసరలో పెద్ద ఎత్తున సేవాలాల్ జయంతి నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment