నేషనల్ యూత్ ఫెస్టివల్‌లో ట్రిపుల్‌ఐటీ విద్యార్థిని
భైంసా: బాసరలోని ట్రిపుల్‌ఐటీ విద్యార్థిని మధులత నేషనల్ యూత్ ఫెస్టివల్‌లో పాల్గొన్నారు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఈ నెల 10, 12వ తేదీల్లో న్యూఢిల్లీలోని భారత్ మండపంలో కార్యక్రమం ఏర్పాటు చేశారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఫెస్టివల్‌లో పాల్గొని విద్యార్థులను అభినందించారు. టెక్ ఫర్ వీక్షిత్ భారత్‌పై మధులత బృందం పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. సంగారెడ్డికి చెందిన మధులత ట్రిపుల్‌ఐటీలో పీయూసీ 2 చదువుతున్నారు. నేషనల్ సర్వీస్ స్కీమ్‌లో సేవలు అందిస్తూ యూత్ ఫెస్టివల్‌కు ఎంపికయ్యారు. జాతీయ స్థాయి ప్రదర్శనలో పాల్గొన్న మధులతను ట్రిపుల్‌ఐటీ వీసీ గోవర్ధన్, అధ్యాపక బృందం అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment