జిల్లాలో, చుట్టు పక్కల ప్రాంతాల్లో పసుపు, సోయా, మొక్కజొన్న, ధాన్యం, కూరగాయలు భారీగా పండిస్తున్నారు. ఈ నేపథ్యంలో కంటెయినర్ ఫ్రైట్ డిపో ఏర్పాటైతే భవిష్యత్తులో డ్రైపోర్టు సైతం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలున్నాయి. దీంతో లక్కంపల్లి సెజ్‌లో వ్యవసాయ అనుబంధ యూనిట్ల ఏర్పాటుకు భారీగా పెట్టుబడిదారులు వచ్చే అవకాశముంది. ఇక్కడే ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. వలసలు తగ్గుతాయి. పైగా జిల్లాలో ఇప్పటికే ఎఫ్‌పీవోల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఈ క్రమంలో రాష్ట్రప్రభుత్వం డిచ్‌పల్లి రైల్వేస్టేషన్ సమీపంలో ఇన్‌ల్యాండ్ కంటెయినర్ డిపో ఏర్పాటుకు 50 నుంచి 60 ఎకరాల భూమి కేటాయిస్తే సరిపోతుంది. రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయింపు లేదా భూమి లీజ్‌కు ఇస్తే వెంటనే పనులు ప్రారంభిస్తామని కంటెయినర్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment