No Headline
నియామకపత్రాలు అందజేత
నిజామాబాద్ నాగారం: జిల్లా వైద్య, ఆరోగ్య శాఖలోని ఆయుష్మాన్ విభాగంలో ఖాళీగా ఉన్న 13 పోస్టుల్లో నూతన నియామకాలు చేపట్టినట్లు డీఎంహెచ్‌వో రాజశ్రీ అందజేశారు. నూతనంగా ఎన్నికై న వారికి డీఎంహెచ్‌వో కార్యాలయంలో నియామక పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో ఏవో చందర్, సిబ్బంది పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల సర్వే పరిశీలన
ధర్పల్లి: మండలంలోని ఎస్‌బీ తండా, ధర్పల్లి, దమన్నపేట్ గ్రామాల్లో నిర్వహిస్తున్న ఇందిర మ్మ ఇళ్ల సర్వేను ఎంపీడీవో బాలకృష్ణ శుక్రవా రం పరిశీలించారు. ప్రభుత్వ మార్గదర్శకాలను పాటిస్తూ, పొరపాట్లకు తావు లేకుండా సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. అ నంతరం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలతో పాటు అంగన్‌వాడీ కేంద్రాలను తనిఖీ చేసి మ ధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. అధికారులు, సిబ్బంది ఉన్నారు.
సిర్‌పూర్ పాఠశాల పరిశీలన
మోపాల్: మండలంలోని సిర్‌పూర్ ప్రాథమిక, ఉన్నత పాఠశాలను ఎంఈవో గేమ్‌సింగ్ శుక్రవారం పరిశీలించారు. పాఠశాలలో అమలవుతున్న తొలిమెట్టు, ఉన్నతి కార్యక్రమాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. మధ్యాహ్న భోజనం మెనూ ప్రకారం అమలు చేయాలని సూచించారు. ఆయన వెంట హెచ్‌ఎం సత్యనారాయణ, నాగమణి, ఉపాధ్యాయులు రాము, వసంత, అక్బర్ భాష తదితరులు ఉన్నారు.
తెలంగాణ భావజాలంపై రేవంత్ దాడి
నిజామాబాద్ అర్బన్ : తెలంగాణ రాష్ట్రం సాధించి, పదేళ్ల ప్రగతిఫలాలు ప్రజలకు అందించిన కేసీఆర్‌ను లక్ష్యంగా చేసుకుని కుట్ర కేసులకు రేవంత్ రెడ్డి పునూకుంటున్నారని భారతీయ రాష్ట్ర సమితి జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడు దాదన్నగారి మధుసూదన్ రావు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు చేసి రాష్ట్రాన్ని సాధించుకున్న బీఆర్‌ఎస్‌కు, కేటీఆర్‌కు కేసులు కొత్తేమి కాదన్నారు. కుట్రకేసులను లీగల్‌గా ఎదుర్కొని చేదిస్తామని స్పష్టం చేశారు.
సంక్షిప్తం
Comments
Please login to add a commentAdd a comment