నగరంలో ఇందిరమ్మ ఇళ్ల సర్వే తనిఖీ
నిజామాబాద్ సిటీ: జిల్లాలో జరుగుతున్న ఇందిర మ్మ ఇళ్ల సర్వేను జిల్లా ప్రత్యేకాధికారులు పరిశీలించారు. నగరంలో జరుగుతున్న ఇందిరమ్మ ఇళ్ల సర్వే ను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించేందుకు కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు ప్రత్యేక అధికారులను నియమించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని పలు డివిజన్లలో జరుగుతున్న సర్వేను ప్రత్యేకాధికారులు స త్యనారాయణ, శంకరయ్య బల్దియా టౌన్ ప్లానింగ్ అధికారి చిదుర రమేశ్‌తో కలిసి తనిఖీలు చేశారు. న గరంలోని చంద్రశేఖర్ కాలనీ, కోటగల్లీ, చంద్రశేఖ ర్ కాలనీ, దుబ్బలో బిల్ కలెక్టర్లు మొబైల్‌లో సర్వే వివరాలు సేకరిస్తున్నారు. మొబైల్ యాప్‌లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల వివరాలు నమోదు చేస్తున్న తీరును పరిశీలించారు. అనుమానాలను నివృత్తి చే శారు. తప్పులు లేకుండా వివరాలను నమోదు చే యాలని సూచించారు. దరఖాస్తుదారులతో ప్రత్యేకాధికారులు మాట్లాడారు. మొబైల్ యాప్ సర్వేలో సర్వర్ జామ్ సమస్యను పరిష్కరించడంతో సర్వే యథావిధిగా సాగుతోందని సిటీ టౌన్ ప్లానింగ్ అఽధికారి చిదుర రమేశ్ తెలిపారు.
క్షేత్రస్థాయిలో తనిఖీ చేసిన
ప్రత్యేకాధికారులు
బిల్ కలెక్టర్లకు పలు సూచనలు
Comments
Please login to add a commentAdd a comment