అమిత్‌షాను బర్తరఫ్ చేయాలి
నిజామాబాద్ సిటీ: అంబేడ్కర్‌ను అవమానించేలా వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను వెంటనే బర్తరఫ్ చేయాలని ఐద్వా నాయకులు డి మాండ్ చేశారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని వర్ని చౌరస్తాలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఐద్వా నాయకులు సుజాత, రజియా, రేఖ, శ్రీదేవి, పద్మ, యశోద, శిరీష, పలు కాలనీ వాసులు పాల్గొన్నారు. అంబేడ్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసి న హోంమంత్రి అమిత్‌షా వెంటనే క్షమాపణలు చె ప్పాలని బీఎల్‌పీ అధ్యక్షుడు వెంకట్ డిమాండ్ చేశా రు. జిల్లా కేంద్రంలోని ఫులాంగ్ చౌరస్తాలోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో నాయకులు మేకల రాజేంద ర్, దండు జ్యోతి, పద్మిని వాగ్మారే, రాధా బాయి, జి జాబాయి, ప్రకాశ్, దుర్గా పాల్గొన్నారు. జక్రాన్‌పల్లి మండల కేంద్రంలో ఎస్సీ ఐక్య వేదిక నాయకులు కేంద్ర హోం మంత్రి అమిత్ షా దిష్టిబొమ్మను దహ నం చేశారు. వెంటనే భారత జాతికి క్షమాపణ చె ప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మండల బహుజన నాయకులు వంశీ, సునీల్, బాబన్న, వసంత్‌రావు, వెంగళ్‌రావు, బండి చిరంజీవి, గోలి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment