బల్దియాలో ఎట్టకేలకు కుటుంబ సర్వే
నిజామాబాద్ సిటీ : నిజామాబాద్ కార్పొరేషన్ పరిధిలో మిగిలిపోయిన చోట్ల కుటుంబ సర్వే ను ఎన్యుమరేటర్లు వెంటనే చేపట్టారు. సాక్షి దినపత్రికలో ‘మాకు లేదా కుటుంబ సర్వే’పేరుతో వచ్చిన కథనానికి బల్దియా కమిషనర్ ది లీప్‌కుమార్ వెంటనే స్పందించారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు 10 మంది స్పెషల్ టీంలను గాయత్రినగర్‌కు పంపించారు. సూపర్‌వైజర్‌తో పాటు 10 మంది ఎన్యుమరేటర్లు గాయత్రినగర్, రోడ్డు నెంబర్ 1లో సర్వే చేపట్టారు. సుమారు 120 గృహాల సర్వేలను చేశారు. మిగిలిపోయిన గృహాలను శనివారం ఉదయం చేయనున్నట్లు ఎన్యుమరేటర్లు తెలిపారు. స్థానిక కార్పొరేటర్ ఇప్పకాయల స్రవంతి భర్త కిశోర్ సర్వే జరగని ఇండ్లను దగ్గరుండి సర్వే చేయించారు. తమ సమ స్య పరిష్కారానికి కృషిచేసిన ‘సాక్షి’ దినపత్రికకు గాయత్రినగర్‌వాసులు కృతజ్ఞతలు తెలిపారు.
10 స్పెషల్ టీంలతో కుటుంబ సర్వే
గాయత్రినగర్‌లో సర్వేచేసిన ఆర్పీలు
హర్షం వ్యక్తం చేసిన
గాయత్రినగర్ వాసులు
Comments
Please login to add a commentAdd a comment