వైభవంగా అయ్యప్ప మహా పడిపూజ
నిజామాబాద్ రూరల్: నగరంలోని వినాయక్‌నగర్‌లో అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన మహాపడిపూజ అయ్యప్ప మాలదారులు, భక్తుల కోలా హలం మధ్య వైభవంగా జరిగింది. మణికంఠస్వామికి భారీ సెట్టింగ్‌లు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో అయ్యప్ప మాలదారుల శరణగోషతో వినాయక్‌నగర్ ప్రాంతమంతా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. పడిపూజ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ బల్యపల్లి సుబ్బారావు గురుస్వామి చేతులమీదుగా ధన్‌పాల్ వినయ్‌కుమార్‌స్వామి దంపతులతో మహాపడిపూజ, అభిషేకం నిర్వహించారు. ఎమ్మె ల్యే ధన్‌పాల్ మాట్లాడుతూ.. హిందూ ధర్మంలో భాగంగా వ్యక్తి నడవడిక మానవ జీవన విధానం భక్తి మార్గంలో నడవడానికి అయ్యప్ప దీక్ష ఎంతో దోహదపడుతుందన్నారు. ప్రతి మనిషి తన జీవితంలో అయ్యప్ప దీక్ష తీసుకోవడంతో మానవ జన్మ పరిపూర్ణం అవుతుందన్నారు. తమ కుటుంబం నుండి గత ఇరవై ఏళ్లుగా అయ్యప్ప దీక్ష తీసుకోవడం ఆనవాయితీగా వస్తుందని అన్నారు. అయ్య ప్ప స్వాములు దీక్ష తీసుకున్న నాటి నుండి కఠినమైన నియమ నిష్టలతో దైవ ఆరాధనలో ఎలాగైతే ఉంటారో దీక్ష అనంతరం కూడా హిందూ ధర్మం రక్షణకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలన్నారు. అనంతరం అయ్యప్ప స్వాములకు, జిల్లా వాసులకు అన్నదానం(భిక్ష)ను ఎమ్మెల్యే వడ్డించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్‌కులచారి, రాష్ట్ర బీజేపీ సీనియర్ నాయకులు చీకటోల ప్రవీణ్, నర్సింగ్‌పల్లి ఇందూరు తిరుమల వ్యవస్థాపకుడు నర్సింహచారి, నరాల సుధాకర్, బీజేపీ నాయకులతో పాటు మహిళా భక్తులు, అయ్యప్ప స్వామి దీక్షాపరులు, ప్రజలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment