అమిత్‌షాను బర్తరఫ్ చేయాలి
● కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డి
నిజామాబాద్ అర్బన్: అంబేడ్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను వెంటనే బర్తరఫ్ చేయాలని, దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డి డిమాండ్ చేశారు. అమిత్‌షా వ్యాఖ్యలకు నిరసనగా పార్టీ ఆదేశానుసారం రాష్ట్రపతికి కలెక్టర్ ద్వారా మెమోరండం ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టారు. కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం జాయింట్ కలెక్టర్‌కు రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్‌బిన్ హందాన్, నూడా చైర్మన్ కేశవేణుతో కలిసి మెమోరండం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశానికి రాజ్యాంగాన్ని అందించిన అంబేడ్కర్ ఆనవాళ్లను తుడిచే ప్రయ త్నం చేస్తున్న బీజేపీకి రాబోయే రోజుల్లో ప్రజలే బుద్ధి చెబుతారని అన్నారు. కార్యక్రమంలో రత్నాకర్, అంతరెడ్డి రాజారెడ్డి, గోపి, విపుల్‌గౌడ్, వేణురాజ్, సంతోష్, లింగం, నరేందర్ గౌడ్, శ్రీనివాస్, బొబ్బిలి రామకృష్ణ, వినయ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment