ఘనంగా జాతీయ వినియోగదారుల దినోత్సవం
సుభాష్‌నగర్: నగరంలోని కలెక్టరేట్‌లో మంగళవారం జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా ‘వినియోగదారు న్యాయపాలనకు వర్చువల్ విచారణలు, డిజిటల్ సౌకర్యం’ అనే నినాదంతో ప్రచురించిన వాల్‌పోస్టర్లను అదనపు కలెక్టర్ కిరణ్‌కుమార్ ఆవిష్కరించారు. అనంతరం వినియోగదారుల ఫోరం చైర్మన్ రాజేశ్వర్ మాట్లాడుతూ.. మోసపూరిత ప్రకటనలు, సంస్థలపై ఫిర్యాదులు చేయడానికి కేంద్రం హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసిందని, వాట్సాప్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చన్నారు. వినియోగదారులు హెల్ప్‌లైన్ నెంబర్ 1915, వాట్సాప్ నెంబర్ 8800001915కి ఫిర్యాదు చేయాలని సూచించారు. సివిల్ సప్లయ్ డీఎం అంబదాస్ రాజేశ్వర్, ఏఎస్‌వో రవికుమార్ రాథోడ్, లీగల్ మెట్రాలజీ, ఫుడ్ సేఫ్టీ, డ్రగ్ ఇన్‌స్పెక్టర్లతోపాటు ఇందూరు వినియోగదారుల వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు పెందోటి అనిల్‌కుమార్, సందు ప్రవీణ్, మహాదేవుని శ్రీనివాస్, గైని రత్నాకర్, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment