మున్సిపల్ కమిషనర్‌కు వినతి
నిజామాబాద్ సిటీ: మున్సిపల్ కార్పొరేషన్‌లో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ కార్మికులను సెల్ఫ్‌హెల్ప్ గ్రూప్‌ల మాదిరిగా ఇవ్వాలని బీఎల్‌టీయూ అధ్యక్షుడు వెంకట్ అన్నారు. మంగళవారం మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు. అనంతరం వెంకట్‌మాట్లాడుతూ.. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పనిచేస్తున్న సుమారు 1200 మంది ఔట్‌సోర్సింగ్ కార్మికులను హైదరాబాద్‌కు చెందిన కాంట్రాక్టర్లకు ఇవ్వడం వల్ల మున్సిపల్ కార్పొరేషన్‌కు ఏడాదికి రూ. 47,80,800 నష్టం వాటిల్లుతుందని అన్నారు.
మంగళ్‌దాస్ మహరాజ్‌కు భగవద్గీత అందజేత
సుభాష్‌నగర్: బాబా రామ్ ప్రియదాస్ జీ మహరాజ్ సేవా సంస్థాన్, శ్రీ రామానందచార్య ఆశ్రమ పీఠాధిపతి మంగళ్‌దాస్ మహరాజ్‌కు ప్రముఖ సామాజికవేత్త, మంచాల శంకరయ్య చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మంచాల జ్ఞానేందర్ భగవద్గీతను మంగళవారం అందజేశారు. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళాలో ఖల్సా ఏర్పాటు చేస్తున్న విషయాన్ని జ్ఞానేందర్ దృష్టికి మహరాజ్ తీసుకొచ్చారు. కుంభమేళాలో ఖల్సాకు తమవంతు సహకారం ఉంటుందని జ్ఞానేందర్ తెలిపారు.
28న రెండు వామపక్షాలు విలీనం
నిజామాబాద్ సిటీ: తెలంగాణలోని రెండు ప్రధాన వామపక్ష పార్టీలు కలిసిపోనున్నట్లు నాయకులు తెలిపారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కోటగల్లీలోని ఎన్‌ఆర్ భవన్‌లో విలీన సభ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈనెల 28న సీపీఐ(ఎంఎల్), న్యూడెమోక్రసీ పార్టీలు రెండు విలీనం కానున్నాయి. దీనికి సంబంధించిన విలీన సభ హైదరాబాద్‌లోని సుందర్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించనున్నట్లు నాయకుడు ఆకుల పాపయ్య పేర్కొన్నారు. సభకు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు వేల్పూర్ భూమయ్య, నీలం సాయిబాబా, శివకుమార్, రమేశ్, జన్నారపు రాజేశ్వర్, మోహన్, రాజు, శంకర్, దేవస్వామి, కృష్ణగౌడ్, బన్సి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment