నూతన కమిటీ ఎన్నిక
నిజామాబాద్ నాగారం: బాపూజీ వచనాలయ పరిరక్షణ నూతన కమిటీని మంగళవారం ఎన్నుకున్నారు. నగరంలోని ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం నిర్వహించిన సమావేశంలో నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా బాస రాజేశ్వర్, గౌరవ అధ్యక్షుడిగా శివరాజులుగుప్తా, కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఆల్గోట్ రవీందర్, ఉపాధ్యక్షులుగా డాక్టర్ రవీంద్రనాథ్‌సూరి, డాక్టర్ ఎం రవీందర్, గుజ్జ రాజేశ్వరి, గుజరాతి రాజేశ్వర్, ప్రధాన కార్యదర్శిగా కోయెడి నర్సింలుగౌడ్, సలహాదారులుగా ఎండీ రఫీక్‌ఖాన్, కార్యదర్శులుగా బాస ప్రకాశ్, మధుసూదన్‌శర్మ, కోశాధికారిగా కొట్టూరు మరుతిగుప్తా, ఆర్గనైజింగ్ కార్యదర్శులుగా కోహినూర్ రాజేందర్, కె నవీన్‌కుమార్, సహాయ కార్యదర్శులుగా జగనామ చంద్రశేఖర్‌శర్మ, వై గోవర్ధన్, ఈసీ మెంబర్లుగా బాపూడి పద్మ, జె నాగమణి, అంబ్ల గజానంద్, నగేశ్‌దయాకర్, ఎండీ అలీమొద్దీన్ ఎన్నికయ్యారు.
బోధన్ టీఎన్జీవోఎస్..
నిజామాబాద్‌అర్బన్: బోధన్ డివిజన్ టీఎన్జీవోఎస్ నూతన కార్యవర్గాన్ని మంగళవారం ఎన్నుకున్నారు. జిల్లా కేంద్రంలోని టీఎన్జీవోఎస్ భవనంలో జిల్లా అధ్యక్షుడు సుమన్ ఆధ్వర్యంలో ఈ ఎన్నిక జరిగింది. అధ్యక్షుడిగా రాజశేఖర్, కార్యదర్శిగా సాయిలు, ఉపాధ్యక్షులుగా కిశోర్, కోశాధికారిగా గంగాధర్ ఎన్నికయ్యారు. కోఆప్షన్ పద్ధతిన ఎన్నుకున్నట్లు జిల్లా అధ్యక్షుడు సుమన్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment