నిజాం షుగర్స్‌కు అడుగులు | - | Sakshi
Sakshi News home page

నిజాం షుగర్స్‌కు అడుగులు

Published Sun, Dec 29 2024 2:01 AM | Last Updated on Sun, Dec 29 2024 2:00 AM

నిజాం

నిజాం షుగర్స్‌కు అడుగులు

ఎస్సారెస్పీ

ముందుకు సాగని జక్రాన్‌పల్లి

విమానాశ్రయం ప్రతిపాదనలు

రైతులకు రుణమాఫీ, సన్నవడ్లకు బోనస్‌

మహాలక్ష్మి, గృహజ్యోతి పథకాల అమలు, ఇందిరమ్మ ఇళ్ల ప్రక్రియ ప్రారంభం

పూర్తికావొచ్చిన సమగ్ర కుటుంబ సర్వే

నీటి నిల్వ సామర్థ్యం తగ్గిన

శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు

ఉపాధ్యాయ నియామకాలు..

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: ఎన్నికల్లో ఇచ్చిన హా మీ మేరకు వ్యవసాయ ఆధారిత పరిశ్రమల్లో ఆసి యా ఖండంలోనే ప్రఖ్యాతి గాంచిన నిజాం షుగర్స్‌ ఫ్యాక్టరీల ప్రారంభ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం మొదలు పెట్టింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కమిటీ ఏర్పాటు చేసింది. ప్రైవేటు యాజమాన్యం పరిధిలో ఉన్న ఈ ఫ్యాక్టరీకి రూ.400 కోట్ల బ్యాంకు అప్పులు ఉండగా, ప్రభుత్వం వన్‌టైం సెటిల్‌మెంట్‌ కింద రూ.190 కోట్లు చెల్లించింది. ప్రత్యేక కమిటీ విడతల వారీగా రైతులతో సమావేశాలు నిర్వహించింది.

● అధికారుల నిర్లక్ష్యం మూలంగా రూ.417 కోట్ల విలువజేసే కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ను మిల్లర్లు ఇవ్వడం లేదు. డిఫాల్ట్‌ రైసు మిల్లర్లపై చర్యలు తీసుకోవడంలో అధికారులు పట్టింపులేకుండా వ్యవహరిస్తున్నారు.

● కొత్త ఉపాధ్యాయుల భర్తీ ప్రక్రియ పూర్తి చేశారు. 602 మందికి ఉద్యోగాలు వచ్చాయి. సాంకేతిక తప్పిదం జరిగిందంటూ నలుగురి వద్ద నుంచి నియామక పత్రాలను అధికారులు తిరిగి తీసుకున్నారు.

● జిల్లాకు ఇంజినీరింగ్‌ కళాశాలను మంజూరు చేస్తూ రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘం తీర్మానం చేసింది. మరోవైపు జిల్లాకు నవోదయ పాఠశాలను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. తెలంగాణ యూనివర్సిటీ వీసీగా ఆచార్య యాదగిరిరావు నియమితులయ్యారు. సంక్షేమ, గురుకుల పాఠశాల మెనూ చార్జీలను ప్రభుత్వం భారీగా పెంచింది. జిల్లాలో అమ్మ ఆదర్శ పాఠశాలల ద్వారా ప్రభుత్వ పాఠశాలలకు మెరుగులు దిద్దారు. జిల్లాలో 1192 పాఠశాలలు ఉండగా 792 పాఠశాలలను ఎంపిక చేశారు. రూ.39.38 కోట్లు కేటాయించారు.

● మహాలక్ష్మి పథకంలో భాగంగా నిజామాబాద్‌ రీజియన్‌ పరిధిలో 1,69,73,712 మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేశారు. ఆర్టీసీకి రూ.55.44 కోట్ల ఆదాయం సమకూరింది.

● నవంబర్‌ 6 నుంచి జిల్లాలో సమగ్ర కుటుంబ సర్వే ప్రారంభమైంది. నివాస గృహాలను 3,245 బ్లాక్‌లుగా విభజించి 3,343 మంది ఎన్యుమరేటర్లు , 370 మంది సూపర్‌వైజర్లు సర్వే చేశారు. 75 అంశాలు, 56 కాలమ్స్‌లో ఈ సర్వే నడిచింది.

● జిల్లాకు 108 అంబులెన్స్‌లు తొమ్మిది వచ్చాయి. జీజీహెచ్‌లో కొత్తగా 102 మంది రెగ్యులర్‌ స్టాఫ్‌ నర్సులు విధుల్లో చేరారు. మాత శిశుసంరక్షణ కేంద్రంతో పాటు, క్రిటికల్‌ కేర్‌, ఎన్‌సీడీ కేంద్రాలను ప్రారంభించారు.

● శ్రీరాంసాగర్‌ జలాశయం పూడికతీత కోసం ప్రపంచస్థాయి సాంకేతికత ఉపయోగించనున్నట్లు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. కాగా ఈ ఏడాది ప్రారంభంలో జలాశయంలో నీటి నిల్వ సామర్థ్యం 90 టీఎంసీల నుంచి 80.5 టీఎంసీలకు తగ్గినట్లు అధికారులు నిర్ధారించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మంచిప్ప వద్ద జలాశయాన్ని 3.5 టీఎంసీల సామర్థ్యం నుంచి 0.8 టీఎంసీలకు తగ్గించారు.

ఇందిరమ్మ ఇళ్లు

● జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు కోసం మొదటి ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నవారిని గుర్తించి ఇంటింటి సర్వే చేస్తున్నారు.

● ఆరోగ్యశ్రీ కింద 24,804 మందికి వివిధ రకాల ప్రైవేట్‌, ప్రభుత్వ ఆస్పత్రుల్లో సేవలందించారు. ఇందుకు రూ.55.72 కోట్లు ఖర్చు చేశారు. వైద్యఆరోగ్య శాఖలో కొత్తగా 13 మంది మెడికల్‌ ఆఫీసర్లు, 40 మంది స్టాఫ్‌ నర్సులు విధుల్లో చేరారు. కాంట్రాక్టు పద్ధతిలో 13 మంది ఎమ్‌ఎల్‌హెచ్‌పీ, 30 మంది సాఫ్‌ నర్సు పోస్టులను భర్తీ చేశారు. కొత్తగా ఆర్మూర్‌లో ఒక సబ్‌ సెంటర్‌ ఏర్పాటు చేశారు. చందూర్‌లో సబ్‌సెంటర్‌ నిర్మాణానికి భూమి పూజ చేశారు.

గృహజ్యోతి

2,650 కొత్త వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లను ఇచ్చారు. జిల్లాలో మొత్తం 1,85,000 విద్యుత్‌ కనెక్షన్లు ఉన్నాయి. గృహజ్యోతి కింద 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్‌ సౌకర్యానికి 2,79,000 గృహాలను గుర్తించారు. ఇందులో 2,50,000 గృహాలకు మాత్రమే పథకాన్ని అమలు చేస్తున్నారు. నెలకు రూ.10 కోట్ల చొప్పున ప్రభుత్వం కేటాయిస్తోంది. జిల్లాలో ఓవర్‌లోడ్‌, విద్యుత్‌ కోతలను నివారించేందుకు 33/11 సబ్‌స్టేషన్లు కొత్తగా మంజూరు చేశారు.

రుణమాఫీ

రాష్ట్ర ప్రభుత్వం 1,00,612 మంది రైతులకు రూ.782.31 కోట్లు రుణమాఫీ చేసింది. ఈ ఏడాది వానాకాలంలో 5.52 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. జిల్లాలో సన్నవడ్ల బోనస్‌ కింద 48,500 మంది రైతులకు రూ.158 కోట్లు ఖాతాల్లో జమ చేసింది. మరో రూ.35 కోట్లు బోనస్‌ చెల్లించాల్సి ఉంది.

967 చెరువుల్లో 2.27 లక్షల చేప పిల్లలు పోయాలని లక్ష్యం ఉండగా, ఇప్పటివరకు 78 శా తం పంపిణీ పూర్తి చేశారు. హరితహారం కింద గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో 25.11 లక్షల మొక్కలు నాటారు. బ్యాంకు లింకేజీ రుణాలు రూ.1228.71 కోట్లు 20,350 మహిళా సంఘాలకు అందించే లక్ష్యానికి గాను రూ.931.06 కోట్లు, 11360 మహిళా సంఘాలకు అందించారు. శ్రీనిధి పథకం ద్వారా రూ.211 కోట్లు మహిళా సంఘాలకు రుణాలు అందించే లక్ష్యానికి ఇప్పటివరకు రూ.120 కోట్లు అందించారు. ఉపాధి హామీ పథకం ద్వారా 46 లక్షల పని దినాలు పూర్తికాగా, రూ.91 కోట్లు కూలీలకు చెల్లించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
నిజాం షుగర్స్‌కు అడుగులు1
1/7

నిజాం షుగర్స్‌కు అడుగులు

నిజాం షుగర్స్‌కు అడుగులు2
2/7

నిజాం షుగర్స్‌కు అడుగులు

నిజాం షుగర్స్‌కు అడుగులు3
3/7

నిజాం షుగర్స్‌కు అడుగులు

నిజాం షుగర్స్‌కు అడుగులు4
4/7

నిజాం షుగర్స్‌కు అడుగులు

నిజాం షుగర్స్‌కు అడుగులు5
5/7

నిజాం షుగర్స్‌కు అడుగులు

నిజాం షుగర్స్‌కు అడుగులు6
6/7

నిజాం షుగర్స్‌కు అడుగులు

నిజాం షుగర్స్‌కు అడుగులు7
7/7

నిజాం షుగర్స్‌కు అడుగులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement