వాహనదారులకు రూ.12.30 కోట్ల జరిమానా
రెంజల్ పీఎస్‌లో లాకప్ డెత్
రెంజల్ పోలీస్‌స్టేషన్‌లో రత్నావత్ రెడ్యా అనే వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రెంజల్ మండలం వీరన్నగుట్ట ప్రాంతంలో మతిస్థిమితం లేని బాలికపై ఆత్యాచారం చేశాడనే కారణంతో రెడ్యాపై బాలిక బంధువులు దాడి చేశారు. స్థానికులు డయల్ 100కు ఫోన్ చేయడంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని అతడిని స్టేషన్‌కు తరలించారు. అదే రోజు రాత్రి రెడ్యా ప్యాంట్ నాడాతో స్టేషన్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిపై మెదక్ జిల్లా తుప్రాన్ డీఎస్పీ వెంకట్‌రెడ్డితోపాటు జ్యుడీషియల్ విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో కానిస్టేబుల్ సస్పెండ్ కాగా ముగ్గురికి షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. ఫోరెన్సిక్, పోస్టుమార్టం రిపోర్టుల ఆధారంగా తదు పరి చర్యలు తీసుకుంటారని తెలుస్తోంది. ఇప్పటికే ఈ కేసులో 13 మందిపై కేసులు నమోదు కాగా ఏడుగురిని రిమాండ్‌కు తరలించారు.
15 మందికి జీవిత కారాగార శిక్ష
మర్డర్, రేప్ కేసులతోపాటు వివిధ కేసుల్లో న్యాయస్థానం 15 మందికి జీవిత కారాగార శిక్ష విధించింది. అలాగే ఒకరికి పదేళ్లు, మరొకరికి ఏడేళ్లు, నలుగురికి ఐదేళ్లు, ఏడుగురికి మూడేళ్లు, నలుగురికి రెండేళ్లు, 44 మందికి సంవత్సరకాల శిక్ష పడింది.
ఈ – చలానా రూపంలో జిల్లాలోని వాహనదారులకు పోలీసులు రూ.11.40 కోట్ల జరిమానా విధించారు. నగరంలోనే అత్యధికంగా జరిమానా విధించారు. మొత్తం 3,04,914 కేసులు నమోదు చేశారు. అలాగే 7,698 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు కాగా, రూ.88,90,451 జరిమానా వసూలు చేశారు. 165 మందికి జైలు శిక్ష పడింది.
Comments
Please login to add a commentAdd a comment