ఆత్మహత్యలు.. సైబర్ క్రైమ్‌లు
2023లో 356 మంది ఆత్మహత్య చేసుకోగా, ఈ ఏడాది 442 మంది బలవన్మరణాలకు పాల్పడ్డారు. వడ్డీ వ్యాపారుల వేధింపులు, ఆన్‌లైన్ బెట్టింగ్, ట్రేడింగ్ వంటి కారణాలతో పలువురు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. జిల్లాలో గతేడాది 294 సైబర్ క్రైమ్ కేసులు నమోదు కాగా, ఈ ఏడాది 378 కేసులు నమోదయ్యాయి. ఎడపల్లి మండలం వడ్డేపల్లికి చెందిన హరీశ్ అనే యువకుడు ఆన్‌లైన్ బెట్టింగ్‌ల కోసం రూ.60లక్షల అప్పు చేశాడు. దీంతో హరీశ్‌తోపాటు అతడి తల్లిదండ్రులు సురేశ్, హేమలత ఒకేసారి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. వడ్డీ వ్యాపారుల వేధింపులను తాళలేక నగరంలోని న్యాల్‌కల్‌రోడ్డులో నివాసం ఉంటున్న భార్యభర్తలు తమ కూతురితో కలిసి బాసర గోదావరి నదిలో దూకారు. జాలర్లు తల్లిని కాపాడగా, తండ్రీకూతుళ్లు మృతి చెందారు. అలాగే ఆర్థిక ఇబ్బందులతో నగరంలోని ఎల్లమ్మగుట్టకు చెందిన హోంగార్డు రైల్వేస్టేషన్‌లో రైలుకు ఎదురెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment