స్థానిక ఎన్నికల్లో జయకేతనం ఎగురవేస్తాం
నిజామాబాద్ రూరల్: రాష్ట్రంలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ జయకేతనం ఎగురవేస్తుందని ఆ పార్టీ అధినేత కేఏ పాల్ ఆశాభావం వ్యక్తం చేశారు. సోమవారం నగరంలోని బైపాస్ రోడ్డులో గల ప్రైవేట్ హోటల్‌లో మాజీ సర్పంచులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తన జోలికి వచ్చిన వారు గతంలో జరిగిన ఎంపీ, ఎమ్మెల్యే ఎన్నికల్లో మట్టి కరుచుకు పోయారన్నారు. ప్రజల బాగుకోసం నిత్యం కృషి చేస్తున్న ప్రజాశాంతి పార్టీని స్థానిక ఎన్నికల్లో దీవించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీలో ఇప్పటి వరకు నాయకులు, మంత్రుల మధ్య సమన్వయం లేదని విమర్శించారు. ఆ పార్టీ నాయకులు ప్రజా సంక్షేమాన్ని మరిచి, పదవుల కోసం పాకులాడుతున్నారని ఎద్దేవా చేశారు. స్థానిక ఎన్నికల్లో పార్టీ మద్దతుతో పోటీ చేసే వారి కోసం అవసరమైతే తాను ప్రచారం చేస్తానన్నారు.
ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక
అధ్యక్షుడు కేఏ పాల్
Comments
Please login to add a commentAdd a comment