రిసెప్షనిస్టే డాక్టర్!
నిజామాబాద్ నాగారం: రిసెప్షనిస్టే డాక్టర్‌లా రోగులకు రక్త పరీక్షలు చేసుకోవాలని చెప్పిన ఘటన నగరంలోని విజయ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో చోటు చేసుకుంది. వివరాలు.. నవీపేట్ మండలం నాళేశ్వర్‌కు చెందిన లక్ష్మి నరాల నొప్పితో న్యూరోఫిజీషియన్ విష్ణువర్ధన్ వద్దకు ట్రీట్‌మెంట్ కోసం వచ్చింది. లక్ష్మి వద్ద డాక్టర్ కన్సల్టెషన్ ఫీజు రూ.400 వసూలు చేశారు. డాక్టర్ విష్ణువర్ధన్‌ను కలవకముందే ప్రిస్కిప్షన్‌పై పలానా టెస్టులు చేయించుకోవాలని రిసెప్షనిస్టు రాయడంతో ఆమె షాకయ్యారు. డాక్టర్ చూడకుండానే టెస్టులు ఎందుకు చేయించుకోవాలని ఆమె ప్రశ్నించింది. దీంతో సిబ్బంది లక్ష్మిని, ఆమెతో వచ్చిన యువకుడిని బయటకు గెంటేసే ప్రయత్నం చేశారు. ఈ విషయంపై డాక్టర్ విష్ణువర్ధన్‌ను వివరణ కోరేందుకు యత్నించగా ఆయన లేరని బాధితులు ఆరోపించారు. న్యాయవాది పిల్లి శ్రీకాంత్, రెంజల్ బుజ్జి అక్కడకు చేరుకుని డాక్టర్‌ను నిలదీశారు. అనంతరం బాధితులు ఆస్పత్రిపై డీఎంహెచ్‌వోకు ఫిర్యాదు చేశారు.
న్యూరో ఫిజీషియన్ పరీక్షించకుండానే
రక్తపరీక్షలు చేసుకోవాలని సూచన
విజయ ఆస్పత్రి ఎదుట రోగుల నిరసన
Comments
Please login to add a commentAdd a comment