వేర్వేరు కారణాలతో ముగ్గురి ఆత్మహత్య
రాజంపేట: అప్పుల బాధతో ఒకరు ఆత్మహత్య చేసుకున్న ఘటన రాజంపేట మండలం ఆరెపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. వివరాలు.. గ్రామానికి చెందిన కొమ్ము నర్సింలు(37) సోమవారం మధ్యా హ్నం ఇంట్లో ఉరి వేసుకున్నాడు. అప్పుల బాధతో తన భర్త ఆత్మహత్య చేసుకున్నట్లు భార్య సుమలత ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్సై పుష్పరాజ్ తెలిపారు.
జీవితంపై విరక్తితో..
బాన్సువాడ: బాన్సువాడకు చెందిన పురుషోత్తం (40) జీవితంపై విరక్తి చెంది సోమ వారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఏడాదిగా భార్య వేరు గా ఉండటంతో ఆత్మచేసుకున్నట్లు బంధువులు తెలిపారు. మృతునికి ఇద్దరు కుమారులు ఉన్నారు.
మనస్తాపంతో మరొకరు..
బాల్కొండ: బాల్కొండ మండల కేంద్రంలో నివాసం ఉంటున్న నిర్మల్ జిల్లా దిలావర్‌పూర్ మండలం లోకల్ వెల్మల్ గ్రామానికి చెందిన సుంకరి పోశెట్టి(43) సోమవారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఏఎస్సై శంకర్ తెలిపిన వివరాలు.. పాత సామాను ఏరుకొని జీవనం సాగించే పోశెట్టి భార్య నాలుగేళ్ల క్రితం చనిపోయింది. దీంతో బాల్కొండకు చెందిన నక్క పోసానితో సహజీవనం చేస్తున్నాడు. ఆదివారం ఇద్దరి మద్య గొడవ జరగడంతో పోసాని ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. దీంతో మనస్తాపం చెందిన పోశెట్టి దులానికి ఉరి వేసుకున్నాడు. మృతుడి కూతురు ఎర్రొల్ల సంధ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment