అర్హులకే సంక్షేమ పథకాలు
నిజామాబాద్ అర్బన్: అర్హులకే సంక్షేమ పథకాలు అందిస్తామని, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని జిల్లా ఇన్‌చార్జి మంత్రి, రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆదివారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ఉమ్మడి జిల్లా సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. పేదలకు బాసటగా నిలవడానికి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న సంక్షేమ పథకాలకు అర్హులనే ఎంపిక చేస్తామన్నారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, నూతన రేషన్ కార్డుల జారీకి చేపడుతున్న చర్యల గురించి కలెక్టర్లు రాజీవ్‌గాంధీ హనుమంతు, ఆశిష్ సంగ్వాన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. చిన్నచిన్న లోపాలు, సాంకేతికపరమైన ఇబ్బందులు ఉంటే వాటిని సవరించుకోవాలని మంత్రి సూచించారు. ఇప్పటికే అమలులో ఉన్న సంక్షేమ పథకాలను యథాతథంగా కొనసాగిస్తామన్నారు. ఈ నాలుగు కొత్త పథకాలను ఈ నెల 26 నుంచి అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 21 నుంచి 24 వరకు నిర్వహించే గ్రామసభల్లో అర్హులైన వారు ఆయా పథకాల కోసం దరఖాస్తులు అందించాలని సూచించారు. రైతులకు రూ.21 వేల కోట్ల రుణాలు మాఫీ చేశామని మంత్రి జూపల్లి వివరించారు. సాంకేతిక సమస్యలు, ఇతర కారణాలతో ఎవరికై నా మాఫీ జరగకపోతే వారికి కూడా మాఫీ అమలయ్యేలా చూస్తామన్నారు. సమావేశంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎమ్మెల్యేలు సుదర్శన్‌రెడ్డి, భూపతిరెడ్డి, లక్ష్మీకాంతారావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, ధన్‌పాల్ సూర్యనారాయణ, పైడి రాకేశ్‌రెడ్డి, వెంకటరమణారెడ్డి, ఎమ్మెల్సీ కవిత, మైనారిటీ కమిషన్ చైర్మన్ తారిఖ్ అన్సారీ, మేయర్ దండు నీతూ కిరణ్, కామారెడ్డి మున్సిపల్ చైర్‌పర్సన్ ఇందుప్రియ, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
మాట్లాడుతున్న మంత్రి జూపల్లి
నిజామాబాద్ సిటీ: నిజామాబాద్ నగరంలో తాగునీరు, పారిశుధ్య సమస్యలకు శాశ్వత పరి ష్కారం కోసం ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చుచేస్తుందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆదివారం ఆయన నగరంలో అమృత్ 2.0 పనులకు శంకుస్థాపన చేశారు. మున్సిపల్ జోనల్ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడుతూ.. నగరంలో ఇంటింటికి తాగునీ రు అందించడానికి అమృత్ పథకం కింద వా టర్ ట్యాంక్‌ల నిర్మాణం చేపడుతున్నట్లు వివ రించారు. వరద జలాలు నిల్వకుండా స్ట్రామ్ వాటర్ డ్రైనేజీ నిర్మిస్తామన్నారు. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. రానున్న 50 ఏళ్లలో పెరిగే జనాభా అవసరాలను దృష్టిలో పెట్టుకుని తాగునీరు, పారిశుధ్య సమస్య తలెత్తకుండా దాదాపు రూ.400 కోట్లలో పనులు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఏడాదిన్నర కాలంలో ఈ పనుల ను పూర్తి చేయాలని సూచించారు. తాగునీటి వ్యవస్థను మెరుగుపర్చేందుకు రూ.217 కోట్లు మంజూరు చేశామన్నారు. ఈ నిధులతో అలీసాగర్ వద్ద 25 ఎంఎల్‌డీ స్టోరేజ్ ట్యాంకులు ని ర్మిస్తున్నారని, ప్రతి రోజు 2.5 కోట్ల లీటర్ల నీటిని శుద్ధి చేసి నగర ప్రజలకు సరఫరా చేస్తామన్నారు. నగరంలో మరో 18 ట్యాంకులను నిర్మి స్తున్నట్లు తెలిపారు. యూజీడీ పనుల కోసం రూ.162 కోట్ల కేటాయించామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, భూపతి రెడ్డి, సూర్యనారాయణ గుప్తా, మేయర్ దండు నీతూ కిరణ్, నుడా చైర్మన్ కేశవేణు, ఉర్దూ అ కాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, ఐడీసీఎంఎస్ చైర్మన్ తారాచంద్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, బల్దియా కమిషనర్ దిలీప్ కుమార్ పాల్గొన్నారు.
నిజామాబాద్‌అర్బన్: ‘‘మీది పెద్దల సభ.. మా తర్వాత మాట్లాడండి’’ అంటూ జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ఎమ్మెల్సీ కవితతో అన్నారు. సమీక్షలో ప్రభుత్వ పథకాలపై మాట్లాడేందుకు ఎమ్మెల్సీ కవిత ప్రయత్నించగా.. వెంటనే మంత్రి జూపల్లి పైవిధంగా స్పందించారు. దీంతో కవిత చివరలో మాట్లాడారు.
రాకేశ్‌రెడ్డి వర్సెస్ మోహన్‌రెడ్డి
ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి మాట్లాడుతూ పథకాలకు అర్హుల ఎంపిక పారదర్శకంగా ఉండాలన్నా రు. గ్రామసభల్లో లబ్ధిదారుల ఎంపిక విధానం సరికాదన్నారు. గ్రామసభల్లో అధికార పార్టీ నాయకులే పాల్గొంటారని, ఇతరులకు అవకాశం ఇవ్వరన్నారు. దీంతో డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డి జోక్యం చేసుకోవడంతో వాగ్వాదం జరిగింది. ఎమ్మెల్యే వ్యాఖ్యలు సరికావని మోహన్‌రెడ్డి అసహనం వ్యక్తంచేశారు. మంత్రి జూపల్లి సర్దిచెప్పడంతో వివాదం సద్దుమణిగింది.
తాగునీటి సమస్యకు పరిష్కారం
రూ.400 కోట్లతో అభివృద్ధి పనులు
నగరంలో అమృత్ 2.0 పనులు
ప్రారంభించిన మంత్రి
మీది పెద్దల సభ
తర్వాత మాట్లాడండి
పాత పథకాలు యథాతథం
ఈ నెల 26 నుంచి ఇందిరమ్మ ఇళ్లు,
రేషన్ కార్డుల జారీ
ఉమ్మడి జిల్లా సమన్వయ సమావేశంలో మంత్రి జూపల్లి కృష్ణారావు
విలీన గ్రామాల్లో..
నిజామాబాద్ రూరల్: నిజామాబాద్ రూరల్ మండలంలోని విలీన గ్రామాల్లో అ భివృద్ధి పనులకు మంత్రి జూపల్లి ఆది వారం సాయంత్రం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిస్తామన్నారు. అనంతరం సారంగాపూర్ శివారులోని నిర్వహిస్తున్న తబ్లిగి ఇజ్తేమాలో మంత్రి పాల్గొని ప్రార్థనలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment