వినియోగదారుల సంక్షేమ సమితి కమిటీల ఏర్పాటు
సుభాష్‌నగర్: ఇందూర్ వినియోగదారుల సంక్షేమ సమితి ఉమ్మడి జిల్లా కార్యవర్గ విస్తరణతో పాటు డివిజన్, మండల కమిటీలను ఆదివారం ఎన్నుకున్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి సందు ప్రవీణ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా సీసీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సాంబరాజు చక్రపాణి హాజరై కమిటీలను ప్రకటించారు. ఉపాధ్యక్షుడిగా రాజుల రామనాథం, ఆర్మూర్ డివిజన్ అధ్యక్షుడిగా పౌడపల్లి అనిల్, బోధన్ డివిజన్ అధ్యక్షుడిగా మారోజు సుధాకర్‌చారిని నియమించారు. అనంతరం సాంబరాజు చక్రపాణి మాట్లాడుతూ.. జిల్లాలో ఆహార కల్తీపై చైతన్య సదస్సులను ముమ్మరం చేయనున్నట్లు తెలిపారు. ఆన్‌లైన్‌లో ఆహార పదార్థాలను కొనుగోలు చేయొద్దని సూచించారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో ఆహారం కల్తీ జరగకుండా జాగ్రత్తలు వహిస్తున్నామన్నారు. జిల్లా అధ్యక్షుడు పెందోట అనిల్, ఉపాధ్యక్షుడు వీఎన్ వర్మ, ఆర్గనైజింగ్ సెక్రెటరీ మహాదేవుని శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శి గైని రత్నాకర్, రూరల్ ఇన్‌చార్జి యాటకర్ల దేవేష్, గడప రవి కుమార్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment