రైతుల పోరాటంతోనే పసుపు బోర్డు ఏర్పాటు | - | Sakshi
Sakshi News home page

రైతుల పోరాటంతోనే పసుపు బోర్డు ఏర్పాటు

Published Mon, Jan 20 2025 1:20 AM | Last Updated on Mon, Jan 20 2025 1:20 AM

రైతుల

రైతుల పోరాటంతోనే పసుపు బోర్డు ఏర్పాటు

ఆర్మూర్‌: రైతుల పోరాటంతోనే పసుపు బో ర్డు ఏర్పాటైందని రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్‌ అన్వేష్‌రెడ్డి అన్నారు. ఆర్మూర్‌ విత్తన సంస్థ కార్యాలయంలో ఆదివారం ఆయన మాట్లాడారు. రెండు దశాబ్దాలుగా రైతులు సంఘటితంగా పోరాటం చేశారన్నారు. ప సుపు బోర్డు నిజామాబాద్‌ జిల్లాలో ఏర్పాటు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. పసుపు పంటకు రూ.15వేల మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. ఏడాదిలోనే పసు పు బోర్డు కార్యాలయం, సిబ్బంది, నిధులు కేటాయించాలన్నారు. నాటి ప్రభుత్వం పసుపు బోర్డు కోసం పోరాడిన నాయకులపై కేసులు పెట్టిందన్నారు. కేసులతో ఇప్పటికీ పలువురు కోర్టుల చుట్టూ తిరుగుతున్న పరి స్థితి ఉందన్నారు. పసుపు రైతులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. సమావేశంలో రైతు జేఏసీ నాయకులు వి ప్రభాకర్‌, దేగం యాదాగౌడ్‌, లింగారెడ్డి, దేవారాం, శ్రీనివాస్‌రెడ్డి, మంథని ముత్తన్న, కొల వెంకటేష్‌ పాల్గొన్నారు.

58 టీఎంసీలకు తగ్గిన ఎస్సారెస్పీ నీటిమట్టం

బాల్కొండ: శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌ నుంచి ఆయకట్టుకు నీటి విడుదల కొనసాగుతుండటంతో ప్రాజెక్ట్‌ నీటిమట్టం శరవేగంగా తగ్గుతోంది. ప్రాజెక్ట్‌ నుంచి కాకతీయ కాలువ ద్వారా 4 వేల క్యూసెక్కులు, వరద కాలువ ద్వారా 5 వేలు, లక్ష్మి కాలువ ద్వారా 250, సరస్వతి కాలువ ద్వారా 700 క్యూసెక్కులు వదులుతున్నారు. అలీసాగర్‌ లిప్టు ద్వారా 450 క్యూసెక్కులు, గుత్ప లిప్టు ద్వారా 135, ముంపు గ్రామాల ఎత్తిపోతల పథకాల ద్వారా 312, ఆవిరి రూపంలో 397, మిషన్‌ భగీరథకు 231 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 1091(80.5 టీఎంసీలు) అడుగులు కాగా ఆదివారం సాయంత్రానికి 1084.40 (58 టీఎంసీలు) అడుగుల నీరు నిల్వ ఉంది.

దొంగ నోట్ల కలకలం

కామారెడ్డి క్రైం: గాంధారి మండలం చద్మల్‌ తండాలో రూ.500 దొంగ నోట్లు రావడం కలకలం రేపింది. వారం రోజుల క్రితం తండాలో లక్ష్మమ్మ ఆలయం వద్ద మధుర లంబాడాల భోగ్‌ భండార్‌ జాతర మూడు రోజుల పాటు జరిగింది. వేల సంఖ్యలో భక్తులు హాజరై మొక్కులు తీర్చుకున్నారు. రెండు రోజుల క్రితం ఆలయ హుండీని లెక్కించారు. దాదాపు రూ.1.50 కోట్ల ఆదాయం వచ్చింది. వచ్చిన నోట్లలో కొన్ని రూ.500 దొంగ నోట్లు వచ్చినట్లు గుర్తించారు. ఆ నోట, ఈ నోటా దొంగ నోట్ల వ్యవహారం బయటకు పొక్కింది. సామాజిక మాధ్యమాల్లో కొందరు పోస్ట్‌ చేయడంతో గాంధారి పోలీసులు గ్రామానికి చేరుకుని విచారణ జరిపారు. దొంగ నోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి.. ఎన్ని వచ్చాయి అనే కోణంలో విచారణ చేస్తున్నారు. గాంధారి మండలంలో ఎవరైనా దొంగ నోట్లు చెలామణి చేస్తున్నారా అనే కోణంలో కూడా పోలీసులు విచారణ జరుపుతున్నట్లు తెలిసింది.

యోగాతో ఆరోగ్యం

నిజామాబాద్‌ రూరల్‌: మంచి ఆరోగ్యానికి యోగా తప్పనిసరి అని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్‌, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్‌ అన్నారు. ఎక్కొండ ప్రభాకర్‌ ఆధ్వర్యంలో ఆదివారం అర్సపల్లిలో నిర్వహించిన వివేకానంద యోగా కేంద్రం రజతోత్సవ వేడుకలకు ఆలయన వ్యవసాయ కమిషన్‌ సభ్యుడు గడుగు గంగాధర్‌తో కలిసి హాజరయ్యారు. ప్రపంచవ్యాప్తంగా యోగాకు ప్రా ముఖ్యత ఏర్పడుతోందన్నారు. యోగా కేంద్రాల అభివృద్ధికి స్థానిక ఎంపీ కేంద్ర ప్రభుత్వ సహకారం తీసుకోవాలని సూచించారు. తనకు జాతీయ స్థాయిలో గుర్తింపు నిజామాబాద్‌ ప్రజల వల్లే వచ్చిందని పేర్కొన్నారు. యోగా గురువు ప్రభాకర్‌ జిల్లా వ్యాప్తంగా ఎన్నో యోగా కేంద్రాలను ఏర్పాటు చేయడం, యోగా సాధనతో జాతీ య, రాష్ట్ర స్థాయి అవార్డులు పొందడం అభినందనీయమని పేర్కొన్నారు. యోగా గురువు ప్రభాకర్‌ మాట్లాడుతూ.. మధుయాష్కీ ఎంపీగా ఉన్నప్పుడే వివేకానంద యోగా కేంద్రానికి పునాదిరాయి పడిందన్నా రు. అనంతరం మధుయాషీతో పాటు యోగా గురువులు, యోగా సాధనలో అవార్డులు పొందిన పలువురిని సన్మానించారు. బాల శేఖర్‌, మొచ్కూర్‌ లావణ్య, ఇంద్రకరణ్‌ రెడ్డి పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
రైతుల పోరాటంతోనే పసుపు బోర్డు ఏర్పాటు 
1
1/1

రైతుల పోరాటంతోనే పసుపు బోర్డు ఏర్పాటు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement