నిజామాబాద్ అర్బన్: జిల్లాలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన ఉపాధ్యాయులను సన్మానించనున్నట్లు డీఈవో అశోక్ తెలిపారు. సోమవారం జిల్లాకేంద్రంలోని న్యూ అంబేడ్కర్ భవన్‌లో మధ్యాహ్నం 2 గంటలకు డీఈవో అధ్యక్షతన ఈ కార్యక్రమం జరగనుంది. జిల్లా స్థాయిలో 13 మంది ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు.
ప్రధానోపాధ్యాయుల విభాగంలో బాలచంద్రం(రాకాసిపేట) ఎం శ్రీనివాస్(పెర్కిట్), స్కూల్ అసిస్టెంట్ విభాగంలో కృష్ణారెడ్డి(గూపన్‌పల్లి), అరుణ శ్రీ (కంజర), ఆరోగ్యరాజ్(గుండారం), సతీష్ కుమా ర్ వ్యాస్(బినోల), గోవర్ధన్(మద్దేపల్లి), హనుమంత్ రెడ్డి(జాన్కంపేట్), ఎస్టీజీ విభాగంలో శ్రీనివాస్ (వేంపల్లి), రాధాకిషన్ (నర్సాపూర్), పి సాయిలు(కొత్తపల్లి) ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు.
జిల్లా స్థాయిలో 13 మంది ఎంపిక
Comments
Please login to add a commentAdd a comment