మీడియాతో మాట్లాడుతున్న విశ్వక్‌సేన్, పక్కన మహేష్
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఉగాదిని పురస్కరించుకుని ఈ నెల 22వ తేదీన విడుదల కానున్న ధమ్కీ సినిమాలోని ప్రతి సన్నివేశం ప్రేక్షకుల మనసును హత్తుకునేలా ఉంటుందని ఆ చిత్ర హీరో, దర్శక, నిర్మాత విశ్వక్‌సేన్ అన్నారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని ఓ హోటల్‌లో ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడారు. ఈ సినిమాలో తాను డ్యూయల్ రోల్‌లో నటించడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ సినిమాకి తనే కథ రాసుకుని, నిర్మాతగా, దర్శకుడిగా వ్యవహరించానని పేర్కొన్నారు. జూనియర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా ఈ నెల 17న ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నట్లు విశ్వక్‌సేన్ తెలిపారు. ఆస్కార్ అవార్డు అందుకున్న తర్వాత జూనియర్ ఎన్టీఆర్ పాల్గొనే మొట్టమొదటి ప్రమోషన్ కార్యక్రమం తన చిత్రానికి కావడం సంతోషంగా ఉందన్నారు. పాగల్ చిత్రంలో నటించిన నివేదతో ఇది తన రెండో చిత్రమని, హీరోయిన్ పాత్ర గ్లామర్‌కే పరిమితం కాకుండా, కథతో ముడిపడి ఉంటుందని వివరించారు. ఈ సమావేశంలో హాస్య నటుడు ఆచంట మహేష్ పాల్గొన్నారు.
సినీ నటుడు విశ్వక్‌సేన్
Comments
Please login to add a commentAdd a comment