5 టన్నుల పండ్లు వితరణ | - | Sakshi
Sakshi News home page

5 టన్నుల పండ్లు వితరణ

Published Mon, Jul 3 2023 1:06 AM | Last Updated on Mon, Jul 3 2023 1:06 AM

- - Sakshi

మధురానగర్‌(విజయవాడసెంట్రల్‌): దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో జరుగుతున్న శాకంబరీ ఉత్సవాలకు ఆదివారం నగరానికి చెందిన మ్యాంగో మార్కెట్‌ ఫ్రూట్‌ మర్చంట్స్‌ వ్యాపారులు 5 టన్నుల పలు రకాల పండ్లను పంపించారు. ఈ సందర్భంగా నాయకులు ఎంఎస్‌ఆర్‌, ఆర్‌ఎస్‌ఆర్‌ మాట్లాడుతూ ఏటా తాము శాకంబరీ ఉత్సవాలకు పండ్లు పంపిస్తున్నామన్నారు. కార్యక్రమంలో పుచ్చకాయల సత్యనారాయణ, పుచ్చకాయల మహేష్‌, పి. కె.కోట్లు పాల్గొన్నారు.

జిల్లాలో 93.49 శాతం పింఛన్‌ పంపిణీ

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): ఎన్టీఆర్‌ జిల్లాలో వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక తొలి రెండు రోజుల్లో 93.49 శాతం పంపిణీ పూర్తయ్యింది. జిల్లాలో మొత్తం 2,27,292 మంది పెన్షనర్లకు గాను 2,12,499 మంది పెన్షన్‌ కానుక అందుకున్నారు. జిల్లాలో అత్యధికంగా జి.కొండూరు మండలంలో 96.93 శాతం, ఇబ్రహీంపట్నం మండలంలో 95.06 శాతం, విజయవాడ రూరల్‌లో 94.25 శాతం, కంచికచర్ల మండలంలో 94.22 శాతం, విసన్నపేటలో 93.87 శాతం పంపిణీ పూర్తి చేశారు.

వాలీబాల్‌ టోర్నీ

విజేత సుబ్బారెడ్డి టీం

విజయవాడ స్పోర్ట్స్‌: విజయవాడ రైల్వే క్రీడా మైదానంలో ఆదివారం నిర్వహించిన రైల్వే వన్డే లోకల్‌ వాలీబాల్‌ టోర్నమెంట్‌ విజేతగా సుబ్బారెడ్డి జట్టు నిలిచింది. వాలీబాల్‌ జాతీయ క్రీడాకారుడు ఎన్‌.ఎన్‌.ఎస్‌.ఆర్‌. గోపాలరావు జ్ఞాపకార్థం ఈ టోర్నమెంట్‌ను నిర్వహించినట్లు రైల్వే స్పోర్ట్స్‌ వెల్ఫేర్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎన్‌.అర్జునరావు తెలిపారు. సీనియర్‌ వాలీబాల్‌ క్రీడాకారుడు గోపాలరావు రైల్వే టెలికమ్యూనికేషన్‌ శాఖలో పని చేశారన్నారు. ఇటీవల జరిగిన ఓ ప్రమాదంలో ఆయన మరణించినట్లు చెప్పారు. ఈ పోటీల్లో మూడు జట్లు పోటీ పడ్డాయన్నారు. అత్యధిక పాయింట్లతో సుబ్బారెడ్డి జట్టు విజేతగా నిలిచి ట్రోఫీని కై వసం చేసుకుందన్నారు. ఇన్‌కం టాక్స్‌ ఆఫీసర్‌ ప్రదీప్‌ విజేతలకు ట్రోఫీ అందజేశారు.

కేజీబీవీల్లో టీచర్‌ పోస్టుల భర్తీ

వన్‌టౌన్‌(విజయవాడపశ్చిమ): ఎన్టీఆర్‌ జిల్లాలోని కస్తూర్భాగాంధీ బాలికా విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న ఏడు టీచర్‌ పోస్టులను భర్తీ చేసినట్లు సమగ్ర శిక్ష శాఖ ఎన్టీఆర్‌ జిల్లా అడిషనల్‌ ప్రాజెక్ట్‌ కోఆర్డినేటర్‌ జి. మహేశ్వరరావు తెలిపారు. జిల్లాలో మూడు కస్తూర్భాగాంధీ బాలిక విద్యాలయాలు ఉన్నాయని పేర్కొన్నారు. అందులో మూడు సీఆర్‌టీ (మ్యాథ్స్‌, ఫిజికల్‌ సైన్స్‌, సోషల్‌ స్టడీస్‌), నాలుగు పీజీటీ (ఇంగ్లిష్‌, మ్యాథ్స్‌, ఫిజిక్స్‌ అండ్‌ కెమిస్ట్రీ) ఏడు పోస్టులకు అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి మే మాసంలో దరఖాస్తులను ఆహ్వానించినట్లు పేర్కొన్నారు. దానికి గాను 723 మంది దరఖాస్తు చేసుకున్నట్లు పేర్కొన్నారు. వెయిటేజ్‌ 85 మార్కుల ప్రకారం 1:3 చొప్పున 21 మందిని ఎంపిక చేశామని తెలిపారు. అందులో జాయింట్‌ కలెక్టర్‌ ద్వారా ఏర్పాటు చేసిన జిల్లా కమిటీ ఏడుగురు అభ్యర్థులను ఎంపిక చేసిందని, వారికి ఈ నెల మొదటి తేదీన నియామక పత్రాలను అందించినట్లు వివరించారు.

దుర్గగుడిలో ఉచిత చెప్పుల స్టాండ్‌

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గా మల్లేశ్వర స్వామి దర్శనానికి విచ్చేసే భక్తులు తమ చెప్పులను ఉచితంగా భద్రపరుచుకోవచ్చని చైర్మన్‌ కర్నాటి రాంబాబు పేర్కొన్నారు. దేవస్థానం పరిధిలోని కనకదుర్గనగర్‌లో ఉచిత చెప్పుల స్టాండ్‌ను ఆదివారం దుర్గగుడి చైర్మన్‌ కర్నాటి రాంబాబు ప్రారంభించారు. కౌంటర్‌ ప్రారంభించిన అనంతరం పలువురు భక్తుల నుంచి టోకెన్‌ తీసుకున్న చైర్మన్‌ కౌంటర్‌లో ఉచిత సేవలను ప్రారంభించారు. అనంతరం కౌంటర్‌లోని సిబ్బందికి సూచనలు చేశారు. కౌంటర్‌ ఎదుట ఉచిత చెప్పుల స్టాండ్‌ బోర్డులు ఏర్పాటు చేయడంతో పాటు చెప్పులు భద్రపరుచుకునే వారి నుంచి డబ్బులు వసూలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/2

2
2/2

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement