![గన్నవరం మండలం బుద్ధవరంలో నీట మునిగిన వరి పనలు చూపుతున్న రైతులు - Sakshi](/styles/webp/s3/article_images/2023/12/7/06gvm03a-310152ff_mr_0.jpg.webp?itok=WNvcQNkU)
గన్నవరం మండలం బుద్ధవరంలో నీట మునిగిన వరి పనలు చూపుతున్న రైతులు
ప్రభుత్వ చర్యలతో ఉపశమనం..
ఆరున్నర ఎకరాల్లో 1061 రకం వరిసాగు చేశా. తుపాను హెచ్చరికలతో యంత్రంతో ధాన్నాన్ని నూర్చి ఇంటికి చేర్చా. తుపాను ప్రభావంతో ధాన్యం తడవకుండా పరదాలు కప్పుకొని కాపాడుకొన్నా. రెండు రోజులుగా వర్షాలు పడటంతో ఆగి, బుధవారం ఆర్బీకే ద్వారా ధాన్యాన్ని మిల్లుకు తరలించారు. ఇక్కడి మిల్లులన్నీ నిండిపోవడంతో ఆఫ్‌లైన్ విధానంలో ధాన్యాన్ని తీసుకొని మంగళగిరి మిల్లుకు తరలించారు. ప్రభుత్వం సకాలంలో ధానాన్ని కొనుగోలు చేసి మద్దతు ధర చెల్లిస్తూ రైతుకు అండగా నిలుస్తోంది.
– బోలెం రామచంద్రరావు, రైతు, మామిళ్లపల్లి, పమిడిముక్కల మండలం
విపత్తు వేళ వెన్నంటి ఉన్న ప్రభుత్వం
పంట నష్టంపై ప్రాథమిక అంచనాలు..
పంట నష్టంపై వ్యవసాయ, ఉద్యానశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రాథమిక అంచనాలను రూపొందించారు. 433 గ్రామాల్లో తుపా ను ప్రభావం ఎక్కువగా ఉందని.. ఈ గ్రామాల్లో సాగు చేసిన 2,33,287.5 ఎకరాల్లో వరి పంట నీటి ముంపునకు గురైందని గుర్తించారు. పది గ్రామాల్లో 2,640 ఎకరాల్లో సాగు చేసిన వేరుశనగ, 121 గ్రామాల్లో 14415 ఎకరాల్లో మినుము, 8 గ్రామాల్లో 530 ఎకరాల్లో పత్తి, ఏడు గ్రామాల్లో 810 ఎకరాల్లో మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నట్లు అంచనా వేశారు. వర్షం కారణంగా బస్తాలకెత్తిన ధాన్యం చెమ్మ కారణంగా అక్కడక్కడా మొలకలు వచ్చినట్లు అధికారులు గుర్తించారు.
కంకిపాడు(పెనమలూరు): మిచాంగ్ తుపాను కృష్ణా జిల్లాను ముంచెత్తింది. తుపాను తీరం దాటే సమయంలో జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం, ఈదురుగాలులు వీచాయి. బుధవారం తెల్లవారుజాము వరకూ తుపాను ప్రభావం ఉంది. భారీ నుంచి అతి భారీ వర్షాలకు జిల్లా అంతటా పంట పొలాలు ముంపునకు గురయ్యాయి. కోతకు సిద్ధంగా ఉన్న వరి పొలాలు నీట మునిగాయి. కోత కోసిన వరి పనలు నీటిలో నానుతున్నాయి. అరటి తోటలు విరిగిపడటంతో రైతులు నష్టాన్ని చవిచూశారు. అయితే ప్రజా ప్రతినిధులు, అధికారులు క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించి, ప్రభుత్వం అండగా ఉంటుందని వారికి భరోసా కల్పించారు.
రైతులకు ధైర్యం నింపుతూ..
పంటచేతికి వచ్చిన తరుణంలో నెలకొన్న అకాల కష్టానికి ప్రభుత్వ యంత్రాంగం, ప్రజాప్రతినిధులు బాసటగా నిలిచారు. గ్రామ గ్రామానా పర్యటిస్తూ ఆందోళనలో మునిగిన రైతులకు ధైర్యం నింపుతూ భరోసా కల్పిస్తున్నారు. నేరుగా పొలాల్లోకి వెళ్లి ముంపునకు గురైన పొలాలను పరిశీలించి రైతులను ఓదార్చారు. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కృష్ణాజిల్లా అంతటా విస్తృతంగా పర్యటించారు. బంటుమిల్లి మండలం ఆర్తమూరు, గూడూరు మండలం చిట్టిగూడూరు, బందరు మండలం అరిసెపల్లి గ్రామాల్లో పర్యటించి బాధిత రైతులకు మనోధైర్యం కల్పించారు. పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి, పామర్రు ఎమ్మెల్యే కై లే అనిల్‌కుమార్, అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌బాబు, మచిలీపట్నంలో పేర్ని కిట్టు పర్యటించారు. గూడూరు మండలం చిట్టిగూడూరులో జిల్లా ప్రత్యేకాధికారి లక్ష్మీశా, జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు పర్యటించి తుపాను నష్టాన్ని అడిగి తెలుసుకుని, జిల్లా వ్యాప్తంగా నెలకొన్న పరిస్థితిపై శాఖాపరమైన సమీక్ష చేశారు.
పంట సంరక్షణలో నిమగ్నం..
తుపాను తీరం దాటడంతో బుధవారం వాతావరణం పొడిగా, పగటి ఉష్ణోగ్రత కూడా సాధారణంగా నమోదైంది. దీంతో రైతాంగం పంట సంరక్షణ చర్యల వైపు దృష్టి పెట్టారు. కలెక్టర్ పి.రాజాబాబు సూచనలతో అధికారులు గ్రామాల్లో పర్యటిస్తున్నారు. పొలాల్లో ఉన్న నీటిని మళ్లించే విధానం, పనల సంరక్షణకు తీసుకోవాల్సిన చర్యలను వివరిస్తున్నారు. ఇప్పటికే ఉయ్యూరు, పామర్రు, కంకిపాడు ప్రాంతా ల్లో పొలాల్లో నిలిచిన నీటిని ఆయిల్ ఇంజిన్ల ద్వారా పంటబోదెల్లోకి మళ్లిస్తున్నారు. నేలవాలిన అరటి చెట్లకు వాసాలను నిలగట్టి గెలలు దెబ్బతినకుండా చర్యలు తీసుకోవాలని రైతులకు సూచిస్తున్నారు. నష్టాన్ని నివారించేలా సూచనలు అందిస్తున్నారు.
మిచాంగ్ తుపాను ధాటికి నీట మునిగిన వరి పొలాలు బస్తాలకెత్తిన ధాన్యంలో మొలకలు పల్లపు ప్రాంతాలు జలమయం క్షేత్రస్థాయిలో పర్యటించినమంత్రి కారుమూరి, ఎమ్మెల్యేలు అండగా ఉంటామని అన్నదాతకు భరోసా
![తోట్లవల్లూరులో ట్రాక్టర్లోకి ధాన్యం లోడ్ చేస్తున్న కూలీలు 1](https://www.sakshi.com/gallery_images/2023/12/7/06pam103c-310130ff_mr_0.jpg)
తోట్లవల్లూరులో ట్రాక్టర్లోకి ధాన్యం లోడ్ చేస్తున్న కూలీలు
![పమిడిముక్కలలోని అగినపర్రులో మొలకెత్తిన ధాన్యం2](https://www.sakshi.com/gallery_images/2023/12/7/06pnm24af-310163ff_mr_0.jpg)
పమిడిముక్కలలోని అగినపర్రులో మొలకెత్తిన ధాన్యం
![3](https://www.sakshi.com/gallery_images/2023/12/7/06pam110-310132_mr_0.jpg)
Comments
Please login to add a commentAdd a comment