విజేతలతో ప్రిన్సిపాల్ శివనాథ్
గుడివాడ టౌన్: ఏఎన్‌ఆర్ కాలేజీ ప్రాంగణంలో కృష్ణా యూనివర్సిటీ అంతర్ కళాశాలల చెస్ మెన్ అండ్ ఉమెన్ టోర్నీ గురువారం జరి గింది. యూనివర్సిటీ పరిధిలోని 12 కాలేజీల విద్యార్థులు ఈ పోటీల్లో తలపడ్డారు. విద్యార్థుల విభాగంలో విజయవాడ ఆంధ్ర లయోలా కాలేజీ ప్రథమం, విజయవాడ కేబీఎన్ కాలేజీ ద్వితీయం, విజయవాడ పీబీ సిద్ధార్థ కాలేజీ తృతీయ స్థానాల్లో నిలిచాయి. విద్యార్థినుల విభాగంలో ఉయ్యూరు ఏజీ అండ్ ఎస్‌జీఎస్ డిగ్రీ కాలేజీ, మచిలీపట్నం ఎస్‌ఎస్‌ఆర్ డాక్టర్ కాలేజీ, విజయవాడ కేబీఎన్ కాలేజీ వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయి. ముగింపు సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఏఎన్‌ఆర్ కళాశాల ప్రెసిడెంట్ లింగం రామకృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ.. విద్యార్థినీ విద్యార్థులు క్రీడా రంగంలో రాణించాలన్నారు. ప్రిన్సిపాల్ డాక్టర్ పి. కుమార్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.శివనాథ్, సెక్రటరీ ఎస్.అప్పారావు, పీడీ వీర్ల గోపి, గ్రంథాలయాధికారి బి.పద్మజ తదితరులు పాల్గొన్నారు.
కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్‌గా పద్మావతి బాధ్యతల స్వీకరణ
సాక్షి, అమరావతి: ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్‌గా డాక్టర్ పద్మావతి గొల్లపూడిలోని డైరెక్టర్ కార్యాలయంలో గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమెకు అధికారులు, ఉద్యోగులు శుభాకాంక్షలు తెలిపారు. జాతీయ కుష్ఠు నిర్మూలన కార్యక్రమం అడిషనల్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న పద్మావతికి డైరెక్టర్‌గా పూర్తి అదనపు బాధ్యతలను(ఎఫ్‌ఏసీ) ప్రభుత్వం అప్పగించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment