గిరిజన రైతులకు ఆర్వోఎఫ్‌ఆర్ పట్టాలు అందజేస్తున్న కలెక్టర్ ఢిల్లీరావు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం గిరిజనుల సంక్షేమానికి కృషిచేస్తోందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.ఢిల్లీరావు తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకా లను, కార్యక్రమాలను గిరిజనులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కలెక్టర్ కార్యాల యంలో జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సోమవారం గిరిజనులకు ఆర్వోఎఫ్‌ఆర్ పట్టాలు పంపిణీ చేశారు. రెడ్డిగూడెం మండలం అన్నారావుపేటకు చెందిన ఎనిమిది మంది గిరిజనులకు 11.44 ఎకరాలకు సంబంధించి ఆర్వోఎఫ్‌ఆర్ పట్టాలు కలెక్టర్ పంపిణీ చేశారు. విజయవాడ రూరల్ మండలం, కొత్తూరు తాడేపల్లికి చెందిన 13 యానాది కుటుంబాలకు గృహ నిర్మాణ సహాయం కింద రూ.8.19 లక్షల మెగా చెక్కు, రెడ్డిగూడెం, ఎ.కొండూరు మండలాలకు చెందిన 77 గిరిజన కుటుంబాలకు బోర్‌వెల్స్ విద్యుదీకరణకు సహాయం కింద రూ.6.70 లక్షల చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఢిల్లీరావు మాట్లాడుతూ.. గిరిజనులను అన్ని విధాలా ఆదుకుని వారి జీవన ప్రమాణాలను పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషిచేస్తోందన్నారు. ఇటీవల ప్రత్యేక కమిటీ ఆమోదించిన గిరిజనులకు ఆర్వోఎఫ్‌ఆర్ పట్టాలు పంపిణీ చేశామని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాలు – పేదలందరికీ ఇళ్ల పథకం కింద పేదల సొంతింటి కలను సాకారం చేస్తోందన్నారు. త్వరితగతిన ఇళ్ల నిర్మాణాలను పూర్తిచేయించి గృహ ప్రవేశాలు చేయించేందుకు అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తోందన్నారు. ఒక్కో యూనిట్‌కు ప్రభుత్వం అందించే రూ.1.80 లక్షలకు అదనంగా గిరిజనుల ఆర్థిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకొని సహాయం చేస్తున్నామని వివరించారు. ప్రభుత్వం చేపట్టిన మంచి కార్యక్రమంలో భాగస్వాములైన గిరిజన సంక్షేమ శాఖకు, వాసవీ మహిళా మండలి (వీఎంఎం), నాబార్డుకు అభినందనలు తెలిపారు.
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు
Comments
Please login to add a commentAdd a comment