రూ. 15 లక్షల విలువైన పైపులు, ఫిట్టింగ్స్ స్వాధీనం
చిట్టినగర్(విజయవాడపశ్చిమ): మార్కెట్‌లో ఆశీర్వాద్ పేరిట నకిలీ పైపులు, ఫిట్టింగ్స్‌ను విక్రయిస్తున్న వ్యక్తిపై కంపెనీ ప్రతినిధి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసిన కొత్తపేట పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి అతని నుంచి రూ. 15 లక్షల విలువైన సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. సేకరించిన వివరాల ప్రకారం విజయవాడతో పాటు కొన్ని ప్రాంతాల్లో ఆశీర్వాద్ పేరిట నకిలీ పైపులు, ఫిట్టింగ్స్ విక్రయిస్తున్నట్లు కంపెనీ ప్రతినిధులకు సమాచారం అందింది. న్యూఢిల్లీకి చెందిన రాజ్‌కుమార్ సాహూ కొత్తపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు చేపల మార్కెట్ ప్రాంతంలో రాజస్తాన్‌కు చెందిన ముఖేష్‌కుమార్ నకిలీ సామగ్రిని విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఆదివారం నిందితుడిని గోడౌన్‌లో గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద సుమారు రూ. 15 లక్షల విలువైన పైపులు, ఫిట్టింగ్స్ ఉన్నట్లు గుర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment