అంకితభావంతోనే ఉత్తమ సేవలు
కృష్ణలంక(విజయవాడతూర్పు): ఉద్యోగులు, కార్మికులు నిరంతరం అంకితభావం, క్రమశిక్షణతో పని చేసి వినియోగదారులకు ఉత్తమ సేవలు అందిస్తున్నామని కృష్ణా డిస్ట్రిక్ట్ లారీ ఓనర్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో ఆపరేటివ్ సొసైటీ పాలకవర్గ సభ్యులు అన్నారు. గవర్నర్‌పేటలోని బాలోత్సవ భవన్‌లో ఆదివారం ది కృష్ణా డిస్ట్రిక్ట్ లారీ ఓనర్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ ఎంప్లాయీస్ యూనియన్ రజతోత్సవ సభలు యూనియన్ అధ్యక్షుడు ఎ.శ్రీనివాస్ అధ్యక్షతన జరిగాయి. ఆయన మాట్లాడుతూ లారీ ఓనర్స్ సంఘం, సొసైటీ ప్రతినిఽధి వై.వి.ఈశ్వరరావు మాట్లాడుతూ కరోనా సమయంలో సైతం కార్మికులు సేవలందించారన్నారు. 58 ఏళ్లుగా పాలకవర్గాలు ఎన్ని మారినా తమ సంస్థ పురోగతిలో ఉందన్నారు. అందుకు పాలకవర్గాల నిర్ణయాలు, ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో చూపిన సంప్రదాయాలే కారణమన్నారు. ప్రస్తుత సొసైటీ సభ్యులు.. గతంలోని పాలకవర్గ సభ్యులకు, యూనియన్‌లో సేవలందించిన పూర్వ ఉద్యోగులకు సన్మానం చేశారు. అనంతరం ఎ.శ్రీనివాసరావు అధ్యక్షుడిగా, జి.గంగాధరరావు కార్యదర్శిగా, మరో 14 మందితో నూతన కమిటీని ఎన్నుకున్నారు. సొసైటీ ప్రతినిధులు వెంకటరమేష్, నాగుమోతు రాజా, కె.జగదీశ్వర్‌రావు, ిసీఐటీయూ నాయకులు దోనేపూడి కాశీనాథ్, ఎం.వి.సుధాకర్, డివి కృష్ణ, ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు జి.గంగాధరరావు, రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు.
విజిలెన్స్ దాడుల్లో
బియ్యం పట్టివేత
గూడూరు: మండలంలలోని రాయవరం గ్రామంలో ఆదివారం రాత్రి విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు మెరుపుదాడులు చేశారు. సీఐలు వెంకటేశ్వర్లు, ఉమర్ ఆధ్వర్యంలో విజిలెన్స్ బృందం రాయవరం గ్రామంలోని సత్యప్రియ రైస్ మిల్‌లో పీడీఎస్ బియ్యాన్ని పట్టుకున్నారు. పక్కా సమాచారంతో నిర్వహించిన దాడుల్లో మిల్లు నుంచి లారీలకు లోడ్ చేస్తున్న 1,280 బియ్యం సంచులను (25 కిలోలు) పట్టుకున్నారు. వీరికి రెవెన్యూ అధికారులు, స్థానిక పోలీసులు సహకరించారు. రైస్ మిల్లు యజమానిపై విజిలెన్స్ అధికారులు కేసు నమోదు చేశారు. మండలంలో ఇంత పెద్ద మొత్తంలో బియ్యం రీసైక్లింగ్ జరగడం స్థానికంగా సంచలనం కలిగించింది. దీని వెనుక అధికార పార్టీ నాయకులు ఉన్నట్లు ఆరోపణలు వినపడుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment