అమిత్‌షా రాజీనామా చేయాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): కేంద్ర మంత్రి అమిత్‌షా రాష్ట్ర పర్యటనను వ్యతిరేకిస్తూ వామపక్షాలు ఆందోళనకు దిగాయి. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌ను అవమానించిన అమిత్‌షా గో బ్యాక్ అంటూ నినాదాలు చేశాయి. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ అలంకార్ సెంటర్‌లోని ధర్నా చౌక్‌లో అమిత్‌షా వ్యాఖ్యలకు నిరసనగా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఆదివారం నిరసన కార్యక్రమం జరిగింది.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ.. కేంద్ర మంత్రి అమిత్‌షా తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి రాజ్యాంగంపైన, అంబేడ్కర్‌పై గౌరవం లేదన్నారు. దేశమంతా అమిత్ షా వ్యాఖ్యలను ఖండిస్తుంటే, మన రాష్ట్రంలో సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పందించకపోవడం దారుణమన్నారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు వి.ఉమామహేశ్వరరావు, సీపీఐ(ఎంఎల్) రాష్ట్ర నాయకులు డి.హరినాథ్, పోలారి, మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్ మాట్లాడుతూ.. పార్లమెంట్‌లో అంబేడ్కర్‌ను అవమానిస్తూ అమిత్‌షా వ్యాఖ్యలు చేయడం దుర్మార్గమన్నారు. సీపీఐ నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన నిరసనలో జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు గుజ్జుల ఈశ్వరయ్య, కార్యవర్గ సభ్యులు రావులపల్లి రవీంద్రనాథ్, కె.రామాంజనేయులు, నగర సహాయ కార్యదర్శి నక్క వీరభద్రరావు, ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నక్కీ లెనిన్ బాబు, ఏఐఎస్‌ఎఫ్ ప్రధాన కార్యదర్శి బి.నాసర్ తదితరులు పాల్గొన్నారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ
Comments
Please login to add a commentAdd a comment