ముగిసిన సంగీతోత్సవాలు
విజయవాడ కల్చరల్: సంగీత సన్మండలి ఆధ్వర్యాన దుర్గాపురంలోని సంగీత కళాశాలలో నిర్వహిస్తున్న సద్గురు త్యాగరాజ స్వామి ఆరాధన సంగీతోత్సవాలు ఆదివారం ముగిశాయి. త్యాగరాజ స్వామి రచించి అత్యంత ప్రాముఖ్యత కలిగిన ఘనరాగ పంచరత్న కీర్తనలను 200 మంది కళాకారులు, వాద్యకారులు ఆలపించారు. మోదుమూడి సుధాకర్, పోపూరి గౌరీనాధ్, మల్లాది సూరిబాబు, మల్లాది సోదరులు, సీవీపీ శాస్త్రి, కేఏ గోవిందరాజన్, శశిధర్, విద్యావైద్యనాధన్, విజయశ్రీ వైద్యనాధన్, విష్ణుభొట్ల సోదరీ మణులు, అంజనా సుధాకర్, మల్లాది కార్తీక త్రివేణి, తుషార పూర్ణవల్లి, కే సుధీర్ శర్మ, శ్రీలలితతోపాటు దేశంలోని వివిధ ప్రాంతాలనుంచి వచ్చిన సంగీత విద్వాంసులు ఘనరాగ పంచరత్నకీర్తనలను కృతి సమర్పణ చేశారు. అన్నవరపు రామస్వామి మాట్లాడుతూ సంగీతం సర్వరోగ నివారిణిగా అభివర్ణించారు. గురు సంప్రదాయాన్ని కాపాడుకోవాలని సూచించారు. సంగీత విద్వాంసుడు మల్లాది శ్రీరాం మాట్లాడుతూ త్యాగరాజ స్వామిలా జీవించడం కష్టమన్నారు. త్యాగరాజ స్వామి ఉత్సవ సంప్రదాయ కీర్తనల బృందగానంతో కార్యక్రమాలు ముగిశాయి.
Comments
Please login to add a commentAdd a comment