గాంధీజీకి ఘననివాళి
సాక్షి, అమరావతి: అహింసా ఆయుధంతో కోట్లాది మంది భారతీయులకు స్వేచ్ఛా, స్వాతంత్రం అందించిన గాంధీజీ మార్గం అనుసరణీయమని ఏపీ ఎస్టీ కమిషన్ సభ్యుడు వడిత్యా శంకర్‌నాయక్ అన్నారు. విజయవాడలోని ఎస్టీ కమిషన్ రాష్ట్ర ప్రధానకార్యాలయంలో గాంధీజీ జయంతి వేడుకలను బుధవారం నిర్వహించారు. ఈసందర్భంగా మహాత్ముని చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించిన శంకర్‌నాయక్ గాంధీజీ సేవలను కొనియాడారు. కార్యక్రమంలో హనుమంత్ నాయక్. వినోద్. ప్రభాకర్, కార్యాలయం, పోలీస్‌సిబ్బంది పాల్గొన్నారు.
స్వచ్ఛభారత్ కోసంఉద్యోగుల వాక్‌థాన్
పటమట(విజయవాడతూర్పు): దేశానికి స్వాతంత్య్రం కంటే పారిశుద్ధ్యమే ముఖ్యమన్న జాతిపిత మహాత్మాగాంధీ ఆశయాలను ప్రధాని నరేంద్రమోదీ స్వచ్ఛభారత్ ద్వారా ఆచరణలో పెట్టారని ఏపీ కస్టమ్స్, జీఎస్టీ కమిషనర్ సాధు నరసింహారెడ్డి, రీజనల్ పాస్‌పోర్ట్ ఆఫీసర్ శివహర్ష అన్నారు. స్వచ్ఛభారత్ కార్యక్రమంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని వారు పిలుపునిచ్చారు. స్వచ్ఛత హి సేవ పక్షోత్సవంలో భాగంగా చివరిరోజు బుధవారం గాంధీజయంతిని పురస్కరించుకుని కేంద్ర ఆర్థిక, విదేశీ వ్యవహారాల శాఖల సంయుక్త ఆధ్వర్యంలో విజయవాడలో వాక్‌థాన్ ర్యాలీ జరిగింది. మనోరమ హోటల్ వద్ద గల ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయం నుంచి ఆల్ ఇండియా రేడియోవద్ద గల పాస్‌పోర్ట్ సేవా కేంద్రం వరకు రెండు శాఖల ఉద్యోగులు భారీగా వాక్‌థాన్‌లో పాల్గొన్నారు. రీజనల్ పాస్‌పోర్ట్ ఆఫీసర్ శివహర్ష మాట్లాడుతూ స్వచ్ఛభారత్ ద్వారా మహాత్మాగాంధీ స్పూర్తి పునరుద్ధరణ జరిగిందన్నారు. దేశప్రయోజనాల కోసమే ప్రధాని స్వచ్ఛతసేవలను కొనసాగిస్తున్నారన్నా రు. కస్టమ్స్, జిఎస్టి కమిషనర్ సాధు నరసింహారెడ్డి మాట్లాడుతూ స్వచ్ఛత కార్యక్రమం జాతికి కొత్తనడవడిని నేర్పుతోందన్నారు. స్వచ్ఛత ఉద్ధేశాన్ని అందరూ గ్రహించి, ఆచరించాలని సూచించారు. తొలుత గాంధీజీ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. వాక్‌థాన్‌లో జీఎస్టీ జాయింట్ కమిషనర్ బి.లక్ష్మినారాయణ, సహాయ కమిషనర్లు బి.రవికుమార్, విఎస్‌కె రాయలు, సీతారామరాజు, సూపరిండింటెంట్లు సిహెచ్ ఈశ్వరరావు, వేణుగోపాల్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment