సీఎం చంద్రబాబు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి
సీఐటీయూ రాష్ట్ర ప్రధానకార్యదర్శి నర్సింగరావు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరగకుండా చూస్తామని సీఎం చంద్రబాబు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి నర్సింగరావు డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను నిలిపివేయాలని కోరుతూ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో విజయవాడ అలంకార్ సెంటర్‌లోని ధర్నాచౌక్‌లో బుధవారం ఽనిరసన దీక్ష చేశారు. ఈసందర్భంగా నర్సింగరావు మాట్లాడూతూ విశాఖ స్టీల్‌కు నిధులు అవసరమైతే మాటిమాటికి మేం కేంద్రాన్ని అడగలేమన్న సీఎం చంద్రబాబు వ్యాఖ్యలను తప్పుపట్టారు. విశాఖ స్టీల్‌ను సెయిల్‌లో విలీనం చేస్తే కేంద్రాన్ని నిధులు అడగాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్రంతోపాటు దేశానికి కూడా ఎంతో ఉపయోగమన్నారు. విశాఖ స్టీల్‌ను ప్రైవేటుకు కట్టబెట్టాలనే దురుద్ధేశంతో బీజేపీ చేస్తున్న ప్రయత్నాలకు సీఎం చంద్రబాబు కూడా సహకరిస్తున్నారని మండిపడ్డారు. పరోక్షంగా ప్రైవేటీకరణకు మద్దతిస్తున్నారని విమర్శించారు. ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.రవీంద్రనాథ్, ఇఫ్టూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.రామకృష్ణ మాట్లాడుతూ విశాఖ స్టీల్‌విషయంలో కూటమి ప్రభుత్వం వందరోజులకే మాట మార్చిందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ నుంచి వైదొలిగిందన్నారు. గతంలో మాజీసీఎం వైఎస్ జగన్ కేంద్రానికి సరైన మెజారిటీ రాకపోతే మెడలు వంచి అన్నీ సాధించుకుంటామన్నారని, దురదృష్టవశాత్తు ఆ రోజు అవకాశం రాలేదన్నారు. ఈరోజు కేంద్రంలో ఉన్న ప్రభుత్వానికి సరైన మెజార్జీ రాలేదని, టీడీపీ పై ఆధారపడిందని గుర్తుచేశారు. ఈ తరుణంలో విశాఖ స్టీల్ ప్లాంట్‌ను కాపాడుకోకుండా బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తుండటం తగదన్నారు. రాష్ట్రప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సీ్‌ట్ల్ ప్లాంట్‌లో తొలగించిన 4వేల మందిని తిరిగి చేర్చుకోవాలని, ప్రైవేటీకరణను వ్యతిరేకించాలని డిమాండ్ చేశారు. నిరసన దీక్షలో మాజీ మంత్రి వడ్దే శోభనాద్రీశ్వరరావు, కళాధర్, కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment