మానవత్వం చాటుకున్న ఎన్‌ఆర్‌ఐలు | - | Sakshi
Sakshi News home page

మానవత్వం చాటుకున్న ఎన్‌ఆర్‌ఐలు

Published Thu, Oct 3 2024 1:48 AM | Last Updated on Thu, Oct 3 2024 1:48 AM

మానవత్వం చాటుకున్న ఎన్‌ఆర్‌ఐలు

మానవత్వం చాటుకున్న ఎన్‌ఆర్‌ఐలు

వృద్ధాశ్రమానికి రూ.13లక్షల విరాళం

అజిత్‌సింగ్‌నగర్‌(విజయవాడసెంట్రల్‌): కన్నబిడ్డలు వదిలేసి.. కుటుంబసభ్యులు దూరం పెట్టిన వృద్ధులకు అండగా నిలిచేందుకు మేము సైతం అంటూ ఎన్టీఆర్‌ జిల్లా విజయవాడకు చెందిన పలువురు ఎన్‌ఆర్‌ఐలు ముందుకు వచ్చారు. బుడమేరు వరదల్లో ఆశ్రయం కోల్పోయిన ఓ ఆశ్రమానికి బాసటగా నిలిచారు. వృద్ధులంతా ఉండేందుకు ఏకంగా ఓ ఇంటిని కొనుగోలు చేసి వారికి బహుమానంగా అందజేశారు.

వృద్ధుల అవస్థలు చూసి చలించి..

అమెరికాలో ఉద్యోగం చేస్తున్న ఆశాజ్యోతి, తుమ్మలపల్లి రాజేశ్వరరావు, భాగ్యలక్ష్మి, వంశీకృష్ణ మిత్ర బృందం విజయవాడ వరదల గురించి తెలుసుకుంది. ప్రధానంగా వాంబేకాలనీలోని మాతృదేవోభవ వృద్ధాశ్రమంలోకి వరద నీరు రావడంతో వృద్ధులు పడిన అవస్థలను తెలుసుకుని వారికి సాయం చేయాలని భావించిన ఎన్‌ఆర్‌ఐలు తమ స్నేహితుల సహకారంతో రూ.13లక్షలను పోగుచేశారు. దాతల కుటుంబసభ్యులు, స్నేహితులు కలిసి ఈమేరకు రూ.13లక్షల విలువగల చెక్కును బుధవారం ఆశ్రమ నిర్వాహకురా లు ఎం.దుర్గకు అందజేశారు. వృద్ధుల కోసం అక్కడే ఉన్న ఓ ఇంటిని కొనేందుకు ఏర్పాట్లు చేశారు. తమ కోసం అందపెద్ద మొత్తంలో డబ్బును దాతలు పంపడంపై ఆశ్రమ నిర్వాహకులు, వృద్ధులు సంతోషం వ్యక్తం చేశారు. కన్నబిడ్డలే పట్టించుకోని తమ గురించి ఇంత మంచి ఆలోచన చేసిన దాతలు, వారి కుటుంబసభ్యులు, స్నేహితులకు కృతజ్ఞతలు తెలియజేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement