చికిత్స పొందుతూ గుర్తు తెలియని వ్యక్తి మృతి
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ వ్యక్తి మృతి చెందిన ఘటన గురువారం చోటు చేసుకుంది. వివరాలు.. ఈ నెల 12న నగరంలోని కాళేశ్వరరావు మార్కెట్ సమీపంలో సుమారు 30 నుంచి 35 ఏళ్ల యువకుడు రోడ్డుపై పడి ఉన్నాడు. స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు 108లో అతన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కోలుకోలేక గురువారం మృతి చెందాడు. ఆసుపత్రి వర్గాలు వన్‌టౌన్ పోలీసులకు సమాచారమందించారు. పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment