శబరిమలకు 26 ప్రత్యేక రైళ్లు | - | Sakshi
Sakshi News home page

శబరిమలకు 26 ప్రత్యేక రైళ్లు

Published Fri, Nov 15 2024 1:50 AM | Last Updated on Fri, Nov 15 2024 1:50 AM

-

రైల్వేస్టేషన్‌(విజయవాడపశ్చిమ): శబరిమలకు వెళ్లే యాత్రికుల డిమాండ్‌ మేరకు వేర్వేరు ప్రాంతాల నుంచి 26 ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. కాచిగూడ – కొట్టాయం ప్రత్యేక రైలు (07131) ఈ నెల 17, 24 తేదీల్లో అర్ధరాత్రి 12.30 గంటలకు కాచిగూడలో బయలుదేరుతుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07132) ఈ నెల 18, 25 తేదీల్లో కొట్టాయం నుంచి బయలుదేరి కాచిగూడ చేరుతుంది. కాచిగూడ – కొట్టాయం (07133) రైలు ఈ నెల 14, 21, 28 తేదీల్లో, కొట్టాయం – కాచిగూడ (07134) రైలు ఈ నెల 15, 22, 29 తేదీల్లో, హైదరాబాద్‌ – కొట్టాయం (07135) రైలు ఈ నెల 19, 26 తేదీల్లో, కొట్టాయం – హైదరాబాద్‌ (07136) రైలు ఈ నెల 20, 27 తేదీల్లో, హైదరాబాద్‌ – కొట్టాయం (07137) రైలు ఈ నెల 15, 22, 29 తేదీల్లో, కొట్టాయం – సికింద్రాబాద్‌ (07138) రైలు ఈ నెల 16, 23, 30 తేదీల్లో, నాందేడ్‌ – కొల్లం (07139) రైలు ఈ నెల 16న, కొల్లం – సికింద్రాబాద్‌ (07140) రైలు ఈ నెల 18న, మౌలాలి – కొల్లం (07141) రైలు నెల 23, 30 తేదీల్లో, కొల్లం – మౌలాలి రైలు (07142) ఈ నెల 25, డిసెంబర్‌ రెండో తేదీన ఆయా స్టేషన్లలో బయలుదేరుతాయి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement