ఉత్సాహంగా.. ఉల్లాసంగా..
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): అనాథ బాలలు, వీధి బాలల్లో ఉత్సాహం ఉరకలెత్తింది. కేరింతలు కొడుతూ ఆట పాటలతో సందడిచేశారు. గాంధీనగర్‌లోని నవజీవన్ బాల భవన్ ఓపెన్ షెల్టర్‌లో ‘సాక్షి’ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన బాలల దినోత్సవం ఇందుకు వేదికై ంది. నవజీవన్ బాల భవన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నీలం రత్నకుమార్, ఆల్ మునీర్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు మునీర్ అహ్మద్, ‘సాక్షి’ బ్యూరో చీఫ్ ఓ.వెంకట్రామిరెడ్డి అనాథ బాలలు, వీధి బాలలతో కలిసి కేక్ కట్ చేశారు. విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేశారు. బాలల దినోత్సవంలో భాగంగా చిన్నారులకు ఆటల పోటీలు నిర్వహించారు. మ్యూజికల్ చైర్స్, లెమన్ స్పూన్, ఫ్రాగ్ జంపింగ్ వంటి పోటీలు జరిగాయి. పోటీల్లో గెలుపొందిన చిన్నారులకు క్యారమ్ బోర్డు, వాలీబాల్, షటిల్ బ్యాట్లు, క్రికెట్ బ్యాట్ వంటి ఆట వస్తువులను అతిథుల చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా నవజీవన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నీలం రత్న కుమార్ మాట్లాడుతూ.. అనాథ బాలలు, వీధి బాలలు దాతల ప్రోత్సా హంతో పట్టుదలగా చదువుకోవాలని సూచించారు. షెల్టర్‌లో ఆశ్రయం పొందు తున్న చిన్నారులు జీవితంలో ఉన్నతంగా ఎదగా లని ఆకాక్షించారు. బాలల దినోత్సవం అంటే బాలల పండుగ అని, ‘సాక్షి’ ఆధ్వర్యంలో జరుపుకోవడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. బాలల దినోత్సవం నిర్వహించి విద్యార్థులకు ఆట వస్తువులు అందించిన ‘సాక్షి’కి కృతజ్ఞతలు తెలిపారు. ఆల్ మునీర్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు మునీర్ అహ్మద్ మాట్లాడుతూ.. మానవ సేవే మాధవ సేవ అన్నారు. అన్ని మత గ్రంథాలు ఈ విషయాన్ని బోధిస్తున్నాయన్నారు. పది మందికి సహాయం చేస్తే తిరిగి పదింతల సాయం మనకు అందుతుందన్నారు. ‘సాక్షి’ యాజమాన్యం ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేస్తోందని అభినందించారు. ప్రత్యేకంగా బాలల దినోత్సవం అనాథ పిల్లల మధ్య జరపడం గొప్ప విషయమన్నారు. పండుగ వాతావరణంలో వేడుకలు నిర్వహించిందన్నారు. అనాథలు, వీధి బాలలకు చేయూత ఇచ్చేలా ఈ కార్యక్రమం జరిగిందన్నారు. ‘సాక్షి’కి ధన్యవాదాలు తెలిపారు. ‘సాక్షి’ బ్యూరో ఇన్‌చార్జి ఓ.వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ.. కల్మషం లేని చిన్నారుల మధ్య బాలల దినోత్సవం జరపాలని తమ యాజమాన్యం నిర్ణయించిందన్నారు. అనంతరం విద్యార్థులకు ఆట వస్తువులను అందజేశారు. నవజీవన్‌లో పరిశోధన చేసేందుకు వచ్చిన విదేశీ విద్యార్థులు అన్నే (జర్మనీ), బార్బారా (జర్మనీ), లూకాస్ (ఆస్ట్రియా) ‘సాక్షి’కి అభినందనలు తెలి పారు. చిల్డ్రన్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించా రని, తొలిసారి మీడియా సంస్థ అనాథలతో కలిసి వేడుకలు జరుపుకోవడం చూశామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఫాదర్ నాలి అంతయ్య, నవజీవన్ ప్రోగ్రామింగ్ మేనేజర్ జి.శేఖర్‌బాబు, ప్రసన్న, బాల భవన్ సిబ్బందిపాల్గొన్నారు.
‘సాక్షి’ ఆధ్వర్యంలో ఘనంగా బాలల దినోత్సవం
విద్యార్థులకు పలు అంశాల్లో పోటీల నిర్వహణ విజేతలకు ఆట వస్తువుల బహూకరణ
సాక్షికి అభినందనలు
పిల్లలతో కలసి ‘సాక్షి’ మీడియా బాలల దినోత్సవం జరుపుకోవడం సంతోషంగా ఉంది. విద్యార్థులకు రకరకాల ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు ఇవ్వడంతో వారి సంతోషం అంతా ఇంతా కాదు. కుటుంబాలకు దూరంగా ఉంటున్న పిల్లలపై సాక్షి మీడియా ప్రదర్శించిన సేవా దాతృత్వం అభినందనీయం.
– శేఖర్‌బాబు, నవజీవన్
బాలభవన్ ప్రోగ్రామ్ మేనేజర్
స్ఫూర్తిదాయకం
చిన్నారులతో కలసి బాలల దినోత్సవం నిర్వహించిన ‘సాక్షి’ మీడియాకు అభినందనలు. ఇటువంటి కార్యక్రమాల ద్వారా పిల్లల్లో ఆత్మస్థైర్యం పెరుగుతుంది. ఆటల పోటీల్లో పిల్లలు ఉత్సాహంగా పాల్గొన్నారు. భవిష్యత్‌లోనూ ఇటువంటి స్ఫూర్తిదాయక కార్యక్రమాలను నిర్వహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.
– ప్రసన్నకుమారి,
బాలభవన్ ఇన్‌చార్జి
Comments
Please login to add a commentAdd a comment