నేటి నుంచి అమరావతి బాలోత్సవం
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): స్థానిక సిద్ధార్థ ఆడిటోరియంలో శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు ఏడో అమరా వతి బాలోత్సవం జరగనుంది. పిల్లల పండుగ పేరుతో విద్యార్థులకు విద్య, సాంస్కృతిక అంశాల్లో పోటీలు నిర్వహిస్తారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని 200 పాఠశాలల నుంచి 20 అంశాల్లో 60 విభాగాల్లో పోటీలు జరుగుతాయి. పోటీల్లో పాల్గొనడానికి విద్యార్థులు ఇప్పటికే పేర్లు నమోదు చేసుకున్నారని అమరావతి బాలోత్సవం అధ్యక్షుడు ఎస్.పి.రామరాజు తెలిపారు. విద్యార్థుల్లో శాస్త్ర విజ్ఞానంపై ఆలోచనలు పెంపొందించేలా ఈ ఏడాది ‘ప్రగతికి మార్గం–శాస్త్ర విజ్ఞానం’ థీమ్‌తో బాలోత్సవం నిర్వహిస్తున్నామ న్నారు. ఈ పోటీలను శుక్రవారం ఉదయం పది గంటలకు సిద్ధార్థ అకాడమీ కార్యదర్శి పాలడుగు లక్ష్మణరావు ప్రారంభిస్తారని, 17వ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు బహుమతి ప్రదానోత్సవం జరుగుతుందని వివరించారు.
నేడు తెప్పోత్సవం
అమరావతి: కార్తికపౌర్ణమి సందర్భంగా శుక్రవారం అమరావతిలో అమరేశ్వరునికి వైభవంగా తెప్పోత్సవం నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈఓ సునీల్‌కుమార్ తెలిపారు. గురువారం ఆయన ఉత్సవ వివరాలను వెల్లడించారు. శుక్రవారం రాత్రి స్వామి గ్రామోత్సవం, అనంతరం కృష్ణానదిలో తెప్పోత్సవం, జ్వాలాతోరణం నిర్వహించటానికి ఏర్పాట్లు చేస్తున్నా మని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment