భక్తిశ్రద్ధలతో పాండురంగడికి పూజలు
మచిలీపట్నంటౌన్: స్థానిక కీర పండరీపురం (చిలకలపూడి)లో వేంచేసియున్న శ్రీ పాండు రంగస్వామి ఉత్సవాలు నాలుగో రోజైన గురువారం వైభవంగా కొనసాగాయి. ఉదయం సహస్ర లింగేశ్వర స్వామికి అభిషేకాలు, విష్ణు సహస్రనామ పారాయణం, సాయంత్రం సహస్ర దీపారాధనలు, కోలాటం, పండరీ భజనలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలను తిలకించి స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. సహస్ర దీపారాధనల్లో మహిళా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని దీపాలు వెలిగించారు. ఈ కార్యక్రమాలను ఆలయ నిర్వాహకులు టేకి నరసింహం పర్యవేక్షించారు. తెల్లవారితే కార్తిక పౌర్ణమి కావటంతో రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులతో ఆలయం కిటకిటలాడింది. శుక్రవారం ఉదయం 9.30 గంటలకు శ్రీ రుక్మిణి అమ్మవారికి కుంకుమపూజలు, పల్లకీ ఉత్సవం, గోపాల కాల ఉత్సవంతో వేడుకలు ముగుస్తాయని నరసింహం తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment