భోజనంలో జెర్రి.. హోటల్ సీజ్
విజయవాడస్పోర్ట్స్: నగరంలోని సూర్యారావుపేటలో ఉన్న కాకినాడ సుబ్బయ్య హోటల్ నిర్వాహకులపై కేంద్ర మానవ హక్కుల కమిషన్ ఇన్చార్జ్ చైర్పర్సన్ విజయభారతి సయాని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ కార్యక్రమం నిమిత్తం గురువారం నగరానికి చేరుకున్న ఆమెకు కాకినాడ సుబ్బయ్య హోటల్ భోజనంలో జెర్రి వచ్చిందనే సమాచారం అందింది. హుటాహుటిన హోటల్‌కు చేరుకుని అక్కడి పరిసరాలను క్షణ్ణంగా పరిశీలించారు. వెంటనే పోలీసులు, కార్పొరేషన్ ఫుడ్ సేఫ్టీ, లీగల్ మెట్రాలజీ అధికారులకు ఆమె సమాచారం ఇచ్చారు. అధికారుల సమక్షంలో ఫుడ్ అండ్ అడల్ట్రేషన్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి హోటల్‌ను సీజ్ చేశారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎవరినీ ఉపేక్షించబోమని ఈ సందర్భంగా ఆమె హెచ్చరించారు. ఈ తరహా ఘటనలు మరెక్కడా చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆమె ఆదేశాలిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment